ఒకే ఒక్క క్రిమినల్ని 1200 మంది పోలీసులు 15 సంవత్సరాలు పాటు ఎందుకు పట్టుకోలేకపోయారనేది భారత దేశపు క్రైమ్ చరిత్రలోనే ఒక మరిచిపోలేని చాప్టర్. వీరప్పన్ని పట్టుకోవటానికి ట్రై చేసి పోలిస్ డిపార్టుమెంటులోని కొన్ని వందలమంది ఎన్నో రకాలుగా తమ ప్రాణాలను కోల్పోయారు. కాని చివరికి ఒక పోలిస్ ఆఫీసరే ఒక కనీ వినీ ఎరుగని ఒక ఇంటలిజెన్స్ ఆపరేషన్లో వీరప్పన్ని చంపేశారు. పోలీసుల నేపధ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని జనవరి 1 న రిలీస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే అందరికంటే ముందు మొట్టమొదటిగా 'కిల్లింగ్ వీరప్పన్' ని పోలిస్ డిపార్టుమెంటుకి ఒక స్పెషల్ షో వేసి చూపించాలని నిర్ణయించుకున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు.
ఈ చిత్రానికి శివరాజ్ కుమార్, సందీప్ భరద్వాజ్, యజ్ఞాశెట్టి, పరూల్ యాదవ్, రాక్ లైన్ వెంకటేష్, తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: రమ్మీ, సంగీతం:రవిశంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: రమ్మీ; సంగీతం:రవిశంకర్ అన్వర్ అలీ; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : సధీర్ చంద్ర పధిరి, నిర్మాతలు:బీవి.మంజునాథ్, ఇ.శివప్రకాష్, , బిఎస్ సుధీంద్ర; కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ.