Advertisementt

'గరం' ఆడియో విశేషాలు!

Thu 24th Dec 2015 03:25 PM
garam movie audio launch,aadi,saikumar,madan,srinivas gavireddy  'గరం' ఆడియో విశేషాలు!
'గరం' ఆడియో విశేషాలు!
Advertisement

ఆది, ఆదాశర్మ జంటగా శ్రీమతి వసంత శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్క్రీన్స్ పతాకంపై మదన్ దర్శకత్వంలో పి.సురేఖ నిర్మిస్తున్న చిత్రం 'గరం'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌ లోని రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు.  గోపీచంద్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బిగ్‌ సీడీని, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..

గోపీ చంద్‌ మాట్లాడుతూ.. ''మదన్‌ మంచి టేస్ట్‌ ఉన్న దర్శకుడు. సినిమా సాంగ్స్‌, ట్రైలర్‌ బావున్నాయి. సాయికుమార్‌గారు నిర్మాతగా సక్సెస్ కావాలి. ఆదికి ఈ సినిమా పెద్ద కమర్షియల్‌ హిట్ గా నిలవాలి'' అని అన్నారు. 

మదన్‌ మాట్లాడుతూ.. ''శ్రీనివాస్‌ గవిరెడ్డి చెప్పిన పాయింట్‌ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి రెడీ అయ్యాను. సినిమా పూర్తి చేయడానికి సంవత్సరం సమయం పట్టింది. మ్యూజిక్ డైరెక్టర్ ఆగస్త్యతో 'పెళ్ళైన కొత్తలో' సినిమాకు పని చేసాను. ఏ ట్యూన్‌ ఇచ్చినా కొత్తగా, ఫాస్ట్‌గా చేసేస్తాడు. ఈ సినిమా కోసం మంచి మాస్‌ సాంగ్స్‌ ఇచ్చాడు. సినిమాను అందరూ ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాం'' అని అన్నారు. 

ఆది మాట్లాడుతూ.. ''శ్రీనివాస్‌ మంచి స్టొరీ ఇచ్చాడు. మదన్‌గారు ఎమోషనల్‌ ఎలిమెంట్స్‌తో పాటు, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను బాగా హ్యండిల్‌ చేశారు. ఆదా చాలా బాగా నటించింది. ఆగస్త్య మంచి ట్యూన్స్‌ ఇచ్చాడు. రీరికార్డింగ్‌ అయితే ఇరగదీసాడు. నా ఫ్యామిలీయే నా బలం. వారికి రుణపడి ఉంటాను. సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమాను మా నాన్నగారికి అంకితం చేస్తున్నాను'' అని అన్నారు.

సాయికుమార్‌ మాట్లాడుతూ.. ''థ్రిల్లర్‌మంజుగారు నా జీవితాన్ని మార్చేసే సినిమా తీశారు. ఈ సినిమాలో మూడు ఫైట్స్‌ను కంపోజ్‌ చేశారు. సినిమా బాగా వచ్చింది'' అని చెప్పారు.

దుగ్గుబాటి రానా మాట్లాడుతూ.. ''సాంగ్స్‌ అన్నీ బావున్నాయి. సినిమా కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను. టీం అందరికి ఆల్‌ ది బెస్ట్‌'' అని అన్నారు. 

కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ.. ''ఆది ఏ పాత్రలో అయినా నటించగలడు. మా బ్యానర్‌లో 'ప్యార్‌మే పడిపోయానే' సినిమాలో నటించాడు. ఫ్యూచర్‌లో ఆదితో మరో సినిమా తప్పకుండా చేస్తాను'' అని అన్నారు. 

ఆగస్త్య మాట్లాడుతూ.. ''నాకు ఈ అవకాశం ఇచ్చిన మదన్‌, సురేఖగారికి, ఆదికి థాంక్స్‌. సినిమాలో ఆది పెర్‌ఫార్మెన్స్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది'' అని అన్నారు. 

రాజ్‌తరుణ్‌ మాట్లాడుతూ.. ''ఆది డ్యాన్సులు చాలా బాగా చేసాడు. సాంగ్స్‌ అన్నీ బావున్నాయి. సాయికుమార్‌గారు ఈ సినిమాతో పెద్ద సక్సెస్‌ కొట్టి నాతో కూడా ఈ బ్యానర్‌లో ఓ సినిమా చేయాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు. 

సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ.. ''ఆదికి సినిమాలు తప్ప మరో లోకం తెలియదు. సాయికుమార్‌ అంకుల్‌గారు తన బ్యానర్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి'' అని అన్నారు. 

బి.ఎ.రాజు మాట్లాడుతూ.. ''మా బ్యానర్‌లో ఆది నటించిన 'లవ్‌లీ' సినిమా సూపర్‌హిట్‌ అయింది. మదన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆది అభిమానులు ఖచ్చితంగా నచ్చుతుంది'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో వీరభద్రం చౌదరి, రామ్‌ తలారి, వెంకట్‌ తలారి, కె.వి.వి.సత్యనారాయణ, థ్రిల్లర్‌ మంజు, రవికుమార్‌, సుబ్బారెడ్డి, కారుమంచి రఘు, సుశాంత్‌, సీనియర్‌ నరేష్‌, భాస్కరభట్ల, పులగం చిన్నారాయణ, షకలక శంకర్‌, మధునందన్‌, అభిరాం, సత్యప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి కథ,మాటలు-శ్రీనివాస్ గవిరెడ్డి, పాటలు: భాస్కర్ భట్ల, చైతన్య ప్రసాద్, శ్రీమణి, పులగం చిన్నారాయణ, కోరియోగ్రఫీ: శేఖర్, జాని, విద్యాసాగర్, ఫైట్స్: థ్రిల్లర్ మంజు, వెంకట్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: టి.సురేందర్ రెడ్డి, సంగీతం: అగస్త్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబ్జి, నిర్మాత: పి.సురేఖ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మదన్.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement