Advertisementt

'ఠాగూర్' బాటలో మరో చిత్రం!

Tue 22nd Dec 2015 06:16 PM
7 to 4 movie trailer launch,vijay sekhar,snehalatha murali,anand  'ఠాగూర్' బాటలో మరో చిత్రం!
'ఠాగూర్' బాటలో మరో చిత్రం!
Advertisement

ఆనంద్, రాధిక, లౌక్య, బాలకృష్ణ, శ్రీనివాస్, మల్లిఖార్జున్ ప్రధాన తారాగణంగా మిల్క్ మూవీస్ పతాకంపై విజయ్ శేఖర్ సంక్రాంతి దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం '7 టు 4'. ఈ చిత్రం ట్రైలర్ ను వల్లురిపల్లి రమేష్ మంగళవారం హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా..

వల్లూరిపల్లి రమేష్ మాట్లాడుతూ.. ''శ్రీలేఖ గారి తరువాత ఈ సినిమా ద్వారా స్నేహలతా మురళి అనే లేడీ మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం కానున్నారు. చక్కటి మ్యూజిక్ అందించారు. సాహిత్యం బాగా కుదిరింది. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ''ఓ కొత్త వొరవడిని సృష్టించడానికి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సోషల్ కాజ్ కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నం సక్సెస్ కావాలి. మంచి సందేశాత్మక చిత్రం'' అని చెప్పారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ''రొటీన్ లవ్ స్టోరీస్ దారిలో వెళ్ళకుండా.. ఠాగూర్ లాంటి కాన్సెప్ట్ తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రజలను ఆలోచింపజేసే చిత్రమవుతుంది. కొత్త యూనిట్ అయినా ఇలానే మంచి కాన్సెప్ట్స్ తో సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

స్నేహలతా మురళి మాట్లాడుతూ.. ''జానపద గాయనిగా అందరికి సుపరిచితురాలినే. ఈ సినిమా ద్వారా సంగీత దర్శకురాలిగా పరిచయమయ్యే అవకాశం వచ్చింది. సినిమాలో మొత్తం 5 పాటలుంటాయి'' అని చెప్పారు.

దర్శకుడు విజయ్ శేఖర్ మాట్లాడుతూ.. ''సమాజంలో కొందరు ప్రముఖులు వైట్ టైగర్స్ అనే రహస్య సంస్థను ఏర్పాటు చేసి నేరాలు చేసేవారిని శిక్షిస్తుంటారు. ఆ సంస్థలో భాగంగా 7 టు 4 అనే టీం ను ప్రత్యేకంగా ఆడవారిపై హత్యాచారాలు చేసే నేరగాళ్ళని పట్టుకోవడానికి నియమిస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ నిగాలో ఉన్న నేరగాళ్ళు అకస్మాత్తుగా అదృశ్యం కావడం అంతుపట్టని విషయంగా మారుతుంది. వారికి వైట్ టైగర్స్ సంస్థ గురించి ఓ క్లూ దొరుకుతుంది. ఈ అంశాలను ప్రధానంగా చేస్తూ.. సినిమా నడుస్తుంటుంది'' అని చెప్పారు.

ఆనంద్, రాధిక, లౌక్య, బాలకృష్ణ, శ్రీనివాస్, మల్లిఖార్జున్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి: రచయితలు: శ్రీకాంత్, రాజేష్, చంద్రశేఖర్, సంగీతం: శ్రీమతి స్నేహలతా మురళి, సాహిత్యం: శ్రీమతి వందన ద్విభాష్యం, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఇ.కె.ప్రభాత్, కెమెరామెన్: చిరంజీవి, ఎడిటర్: సత్య గిడుదూరు, కో డైరెక్టర్: గిరీష్, డిజైనింగ్: గణేష్ రత్నం: డైరెక్టర్: విజయ్ శేఖర్ సంక్రాంతి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement