అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా(ఏఎఫ్ఏ) సంస్థ వారు గత ఏడాది నుండి అక్కినేని ఇంటర్నేషనల్ అవార్డ్స్ వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ఈ వేడుకలు హైదరాబాద్ లో జరిగాయి. పలు రంగాలకు చెందిన ప్రముఖులను ఈ కార్యక్రమంలో సన్మానించడంతో పాటు, అవార్డులను బహూకరించారు. అంతేకాకుండా యువతరాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు, పరిష్కారాలు అనే కాన్సెప్ట్ మీద షార్ట్ ఫిల్మ్స్ తీసి పంపిన వారిలో ప్రధమ, ద్వీతీయ, తృతీయ విజేతలుగా నిలిచిన వారికి యాభై వేలు, ముప్పై వేలు, ఇరవై వేలు చొప్పున నగదు బహుమానం అందించారు.అక్కినేని కుటుంబ సభ్యుల చేతుల మీదుగా 'అక్కినేని ప్రత్యేక సంచిక'ను విడుదల చేశారు. ఈ సందర్భంగా..
ఏఎఫ్ఏ ప్రెసిడెంట్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ''అక్కినేని నాగేశ్వరావు గారు మహానటుడు. ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆయన వ్యక్తిత్వం మహోన్నతమైనది. అట్టడుగు స్థాయి నుండి శికరాగ్ర స్థాయికి చేరుకోవడంలో ఆయన చేసిన కృషి, పట్టుదలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి. గత ఏడాది అక్కినేని నాగేశ్వరావు కళాశాలలో ఈ వేడుకలను నిర్వహించాం. హైదరాబాద్ నగరానికి, నాగేశ్వరావు గారికి మంచి అనుబంధం ఉంది. మద్రాసు నగరం నుండి తెలుగు చలన చిత్ర పరిశ్రమ హైదరాబాద్ రావడానికి నాగేశ్వరావు గారు చేసిన కృషి చిరస్మరణీయమైనది'' అని చెప్పారు.
నాగ సుశీల మాట్లాడుతూ.. ''మొదటగా నాన్నగారి పేరిట ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడుతున్న అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారికి నా శుబాకాంక్షలు. మేము అమెరికా వెళ్ళినప్పుడు వారంతా బాగా చూసుకున్నారు. డా||శ్రీనివాస్ రెడ్డి గారు ఫోన్ చేసి నాన్నగారి గుండె 50 సంవత్సరాలు గల వ్యక్తి గుండె మాదిరిగా ఆరోగ్యంగా ఉందని చెప్పారు. ఆ సమయంలో నాన్నగారికి 90 ఏళ్ళు. ఆయన ఆఖరి పుట్టినరోజు వేడుకలను ఈ ఫౌండేషన్ మెంబర్స్ తోనే జరుపుకున్నారు. నాన్నగారి చివరి రోజుల్లో కూడా వీళ్ళందరితో కలిసి కాన్ఫరన్స్ హాల్ లో మాట్లాడేవారు. కేవలం ఆయన పేరు మీద అవార్డ్స్ ఇవ్వడమే కాకుండా మంచి కాజ్ కోసం షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ఏర్పాటు చేసి ఎందరికి స్ఫూర్తినందిస్తున్నారు. నాన్నగారు పంచిన ప్రేమ మరువలేనిది. అది ఈ జన్మకు మాత్రమే సరిపోదు.. అన్ని జన్మలకు ఆయనే తండ్రిగా కావాలి. జీవితంలో చాలా మంది చాలా సాధిస్తారు కాని సంతోషంగా ఉండలేరు. నాన్నగారు మాత్రం చివరి నిమిషం వరకు సంతోషంగానే ఉన్నారు'' అని చెప్పారు.
కర్నాటి లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ.. ''విదేశాలకు వెళ్ళినా.. పుట్టిన గడ్డను మర్చిపోకుండా అమృత హృదయాలతో తమ దేశంలో ఉన్న ప్రతిభావంతులను గౌరవించాలనుకోవడం గొప్ప విషయం. ఇలాంటి మంచి పనులు చేస్తూ బ్రతుకికి అర్ధం చెప్పిన ఏఎఫ్ఏ సంస్థ వారిని అభినందిస్తున్నాను'' అని చెప్పారు.
రవి కొండబోలు మాట్లాడుతూ.. ''నెక్స్ట్ ఇయర్ ఈ వేడుకలను చెన్నైలో నిర్వహించాలనుకుంటున్నాం. నాగేశ్వరావు గారు నాతో 24 రోజులు కలిసి ఉన్నారు. మహాభారతం సీరియల్ వస్తోన్న సమయంలో ఆయన పీక్ స్టేజ్ లో ఉండడం వలన ఆ 92 రెండు ఎపిసోడ్స్ ను మా ఇంట్లోనే చూశారు. ఆయనతో మంచి అనుబంధం ఉంది'' అని చెప్పారు.
అవార్డుల లిస్టు:
శ్రీ కర్నాటి లక్ష్మినరసయ్య: రంగస్థల రత్న అవార్డు
శ్రీ చుక్కా రామయ్య: విద్యా రత్న అవార్డు
ఏ.వి.ఆర్ చౌదరి: విశిష్ట వ్యాపార రత్న అవార్డు
డా|| గుల్లా సూర్యప్రకాష్: వైద్య రత్న అవార్డు
డా|| సునీత కృష్ణన్: సేవ రత్న అవార్డు
శ్రీ నల్లా విజయ్: కళా రత్న అవార్డు
పూర్ణ మలవత్: యువ రత్న అవార్డు