Advertisement

కల్వకుంట్ల వారి సినిమా ప్రారంభం!

Mon 21st Dec 2015 01:25 PM
she movie opening,kalvakuntla tejeshwarao,ramesh mahendra,swetha menon  కల్వకుంట్ల వారి సినిమా ప్రారంభం!
కల్వకుంట్ల వారి సినిమా ప్రారంభం!
Advertisement

కల్వకుంట్ల తేజేశ్వర్ రావు నిర్మాణ సారథ్యంలో మహేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై పర్స రమేష్ మహేంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'షీ'. 'ఈజ్ వెయిటింగ్' అనేది ఉపశీర్షిక. ఈ చిత్ర ప్రారంభం హైదరాబాద్ లోని అన్నపూర్ణ ఫారెస్ట్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి రమ్య క్లాప్ కొట్టగా, అనూప్ సింగ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. పూరి జగన్నాథ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..

దర్శకుడు పర్స రమేష్ మహేంద్ర మాట్లాడుతూ.. ''ఒక అందమైన ప్రేమకథకు హారర్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మంచి టీమ్ కుదిరింది'' అని చెప్పారు.

చిత్ర నిర్మాత కల్వకుంట్ల తేజేశ్వర్ రావు మాట్లాడుతూ.. ''ఓ సేవా కార్యక్రమంతో భారీగా ఈ చిత్రాన్ని ప్రారంభిస్తానని ఇదివరకే అనౌన్సు చేసాను. మహేశ్వర ఆర్ట్స్ సంస్థ తరఫున అవిభక్త కవలలు అయిన 'వీణ, వాణి'లకు 3 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్నాం. ఇక సినిమా విషయానికొస్తే.. ఇదొక మంచి కమర్షియల్ సినిమా. హారర్, లవ్, రొమాన్స్, ఎమోషన్స్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. జనవరి 4 నుండి రెగ్యులర్ షూటింగ్ నిర్వహించి ఫిబ్రవరి, మార్చి నెల నాటికి పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తి చేసి ఏప్రిల్ మొదటి వారంలో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.

శ్వేతామీనన్ మాట్లాడుతూ.. ''పది నెలల ముందే రమేష్ గారు నాకు ఈ సినిమా కథ చెప్పారు. బాగా నచ్చింది. 'షీ' టైటిల్ రోల్ పోషిస్తున్నాను. మంచి టీం తో పని చేసే అవకాశం వచ్చింది'' అని చెప్పారు.

మహాత్ రాఘవేంద్ర మాట్లాడుతూ.. ''తెలుగులో బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్, లేడీస్ అండ్ జెంటిల్ మెన్ చిత్రాల్లో నటించాను. తమిళంలో ఆఫర్స్ బాగా వస్తున్నాయి. ఈ సినిమా కథ విన్నాను. మంచి కమర్షియల్ స్క్రిప్ట్. ఈ ప్రొడక్షన్స్ లో పని చేయడం చాలా ఆనందంగా ఉంది'' అని చెప్పారు.

చేతన ఉత్తేజ్ మాట్లాడుతూ.. ''హీరోయిన్ గా ఇది నాకు మొదటి సినిమా. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాను. సినిమా స్టొరీ వినగానే బాగా నచ్చింది. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ఉత్తేజ్, కవిత, భోలే తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి ఫైట్స్: సతీష్, డ్యాన్స్: ఏర్రోళ్ళ రమేష్, ఆర్ట్: రామకృష్ణ, సంగీతం: భోలే, సినిమాటోగ్రఫీ: అనిత్, లైన్ ప్రొడ్యూసర్: గట్టు విజయ్ గౌడ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బసంత్ రెడ్డి, నిర్మాత: కల్వకుంట్ల తేజేశ్వర్ రావు, కథ, కథనం, మాటలు, దర్శకత్వం: పర్స రమేష్ మహేంద్ర.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement