శర్వానంద్, సురభి జంటగా మేర్లపాక గాంధి దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న చిత్రం 'ఎక్స్ ప్రెస్ రాజా'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభాస్ బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించి మొదటి కాపీను దిల్ రాజు కు అందించారు. ఈ సందర్భంగా..
ప్రభాస్ మాట్లాడుతూ.. ''మేర్లపాక గాంధీ క్లారిటీ ఉన్న డైరెక్టర్. సినిమా హిట్ అవ్వాలంటే డైరెక్టర్, కథే ముఖ్యం.. తరువాతే ఇంకేదైనా.. యు.వి.క్రియేషన్స్ మా బ్యానర్ లాంటిది. ప్రవీణ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. 'కలర్ ఫుల్ చిలుక' సాంగ్ అందరికీ బాగా నచ్చుతుంది. టీం అందరికి ఆల్ ది బెస్ట్. ఎక్స్ ప్రెస్ రాజా సినిమాను సూపర్ హిట్ చేయండి'' అని చెప్పారు.
మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. ''వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తరువాత ఏం సినిమా చేయాలనే టెన్షన్ తోనే రెండు సంవత్సరాలు గడిచిపోయింది. ఆ తరువాత బ్రహ్మాజీ గారి ద్వారా శర్వానంద్ ను కలిసి కథ చెప్పాను. చెప్పగానే ఆయనకు బాగా నచ్చింది. శర్వాంద్ ను డైరెక్ట్ చేయడమంటే బెంజ్ కార్ ను డ్రైవ్ చేయడం లాంటిది. చాలా స్మూత్ గా, కూల్ గా ఉంటారు. యు.వి.క్రియేషన్స్ లో సినిమా చేస్తే వాళ్ళతో లవ్ లో పడిపోతారు. ఈ బ్యానర్ లో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఆర్టిస్ వాళ్ళ పాత్రను ప్రేమించి చేశారు. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
శర్వానంద్ మాట్లాడుతూ.. ''గాంధీ మంచి స్టొరీ చెప్పాడు. ఈ సినిమాకు కథే హీరో. సినిమాలో ప్రతి పాత్ర ముఖ్యమైనది. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. యు.వి.క్రియేషన్స్ నా హోం బ్యానర్ లాంటిది. మంచి సినిమా చేశాం. అందరికి నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం'' అని చెప్పారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. ''యు.వి. క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి వంశీ, ప్రమోద్ లు గొప్ప గొప్ప చిత్రాలను నిర్మిస్తున్నారు. యు.వి క్రియేషన్స్ అంటే బినామీ ప్రభాసే.. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' వంటి మంచి హిట్ సినిమా చేసిన గాంధి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. గాంధికి, శర్వానంద్ కు, టీం అందరికి ఆల్ ది బెస్ట్. యు.వి.క్రియేషన్స్ లో మరో హిట్ సినిమా రాబోతోంది'' అని చెప్పారు.
మారుతీ మాట్లాడుతూ.. ''సినిమా చూశాను. గాంధీ చాలా బాగా డైరెక్ట్ చేశాడు. శర్వానంద్ నటన, సప్తగిరి కామెడీ బావుంది. ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ సినిమాలో ఉంటుంది. ప్రవీణ్ లక్కరాజు మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.
ప్రవీణ్ లక్కరాజు మాట్లాడుతూ.. ''యు.వి.క్రియేషన్స్ లో పని చేయడమనేది నా కల. నాకు ఈ అవకాశం ఇచ్చిన వంశీ, ప్రమోద్ లకు థాంక్స్. ఎంతగానో సపోర్ట్ చేశారు. మ్యూజిక్, సినిమా అందరికి నచ్చుతుందనుకుంటున్నాను'' అని చెప్పారు.
బ్రహ్మాజీ మాట్లాడుతూ.. ''వంశీ, ప్రమోద్ లు జెన్యూన్ ప్రొడ్యూసర్స్. శర్వానంద్ కూల్ పెర్సన్. నా ఫేవరేట్ డైరెక్టర్ మేర్లపాక గాంధి. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాలో మంచి పాత్ర ఇచ్చి నాలో నూతన ఉత్సాహాన్ని నింపాడు. అదే తరహాలో ఈ చిత్రంలో కూడా మంచి రోల్ ఇచ్చాడు. సినిమా ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సురభి, సత్య, వంశీ, ప్రమోద్, సప్తగిరి, సుప్రీత్, ప్రభాస్ శీను, రఘు కారుమంచి, బన్నీ వాస్, హరీష్ ఉత్తమన్ తదితరులు పాల్గొన్నారు.