కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుమారుగా 300కు పైగా చిత్రాల్లో నటించిన సీనియర్ నటుడు రంగనాథ్ శనివారం, హైదరాబాద్ లోని వారి నివాసంలో అకస్మాత్తుగా మరణించారు. 1949 లో జన్మించిన రంగనాథ్ అసలు పేరు తిరుమల సుందర శ్రీ రంగనాథ్. డిగ్రీ పూర్తి చేసి టికెట్ కలెక్టర్ గా పని చేస్తున్న రంగనాథ్ సినిమాల మీద మక్కువతో 1969వ సంవత్సరంలో 'బుద్ధిమంతుడు' అనే చిత్రం ద్వారా సినీరంగంలో అడుగుపెట్టారు. ఎన్నో హిట్ చిత్రాల్లో, సీరియల్స్ లో నటించిన రంగనాథ్ మరణించడంతో సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి చెందారు. అయితే రంగనాథ్ కుటుంబ సభ్యులు మాత్రం ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పోలీసు స్టేషన్ లో పిర్యాదు నమోదు చేశారు. ఆర్ధిక పరిస్థితుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనపై మరిన్ని విషయాలు తెలియాల్సివుంది. .