Advertisementt

'వినోదం 100%'పై మారుతీ చెయ్యేశాడు!

Sat 19th Dec 2015 02:20 PM
vinodam 100 percent movie,maruthi,sampoornesh babu,jai sreeram  'వినోదం 100%'పై మారుతీ చెయ్యేశాడు!
'వినోదం 100%'పై మారుతీ చెయ్యేశాడు!
Advertisement

ఎస్‌.ఎస్‌. సెల్యులాయిడ్స్‌ పతాకంపై జైశ్రీరామ్‌ దర్శకత్వంలో విజయ్‌భరత్‌, అశ్విని, కాంచనలు హీరో హీరోయిన్‌లుగా పొట్నూరు శ్రీనివాసరావు నిర్మిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'వినోదం 100%'. బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌బాబు, బాయిలింగ్‌ స్టార్‌ పృథ్వీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర ట్రైలర్‌ను డైరెక్టర్‌ మారుతి ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో హీరో విజయ్‌భరత్‌, హీరోయిన్‌ ఆశ్విని తదితరులు పాల్గొన్నారు. అనంతరం 

డైరెక్టర్‌ మారుతి మాట్లాడుతూ.. ''ట్రైలర్‌ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. సినిమాలో ఉన్న విషయం ఏమిటో ట్రైలర్‌లో చక్కగా చూపించారు. డైరెక్టర్‌ జైశ్రీరామ్‌ ఈ చిత్రాన్ని ఎంతో ఫ్యాషన్‌తో చేసినట్లుగా తెలుస్తుంది. యూత్‌ని ఆకర్షించే మంచి ఎంటర్‌టైనర్‌ చిత్రంలా ఉంది. తప్పకుండా మంచి విజయం సాధించి.అందరికీ ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను..'' అని అన్నారు. 

చిత్ర నిర్మాత పొట్నూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ''అవుట్‌ అండ్‌ అవుట్‌ 100% కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాలనే ఉద్ధేశ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. బ్యాంకాక్‌, థాయిలాండ్‌ తదితర ప్రదేశాల్లో షూటింగ్‌ చేశాం. రాబోయే క్రిస్టమస్‌ సందర్భంగా ఆడియోను విడుదల చేయనున్నాము..ట్రైలర్‌ని ఆవిష్కరించిన మారుతిగారికి ధన్యవాదాలు..'' అని అన్నారు. 

చిత్ర దర్శకుడు జైశ్రీరామ్‌ మాట్లాడుతూ.. ''బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌బాబు, బాయిలింగ్‌ స్టార్‌ పృథ్వీల కామెడీ హైలైట్‌గా ఈ చిత్రాన్ని లావిష్‌గా తెరకెక్కించాము. మా హీరో విజయ్‌భరత్‌ చక్కని అభినయాన్ని కనబర్చాడు. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా నిర్మించేందుకు సహకరించారు...మేం అడిగిన వెంటనే మారుతిగారు మా చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరించినందుకు..ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము..'' అని అన్నారు. 

సంపూర్ణేష్‌బాబు, పృథ్వీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌భరత్‌, అశ్విని, కాంచన, సత్యం రాజేష్‌, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, తాగుబోతు రమేష్‌, శకలకశంకర్‌, జీవా మొదలగువారు ఇతర తారాగణం. 

సాంకేతిక నిపుణులు: 

సంగీతం: సుభాష్‌ ఆనంద్‌, కెమెరా: రాజేష్‌, ఎడిటింగ్‌: నందమూరిహరి, నిర్మాత: పొట్నూరు శ్రీనివాసరావు, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జైశ్రీరామ్‌. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement