Advertisementt

చిరు,నాగబాబు గర్వపడేలా చేస్తాడు: పూరి!

Sat 19th Dec 2015 02:07 PM
loafer success meet,puri jagannath,c.kalyan,varun tej,disa patani  చిరు,నాగబాబు గర్వపడేలా చేస్తాడు: పూరి!
చిరు,నాగబాబు గర్వపడేలా చేస్తాడు: పూరి!
Advertisement
Ads by CJ

'ముకుంద', 'కంచె' వంటి విభిన్న కథా చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పరుచుకున్న మెగాబ్రదర్ నాగబాబు తనయుడు సుప్రీమ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్ సి.కళ్యాణ్ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్ పతాకంపై సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్, తేజ నిర్మించిన భారీ చిత్రం 'లోఫర్'. ఇటీవల విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్రం బృందం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా మొదటి కాపీ చూసిన వెంటనే సి.కళ్యాన్ గారు ఫోన్ చేసి సినిమా చాలా బావుంది, హ్యాపీగా ఉండమని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదటి నుండి 'లోఫర్' ఓ ఫ్యామిలీ డ్రామా, మథర్ సెంటిమెంట్ ఉన్న సినిమా అని చెప్పడం ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా రీచ్ అయింది. మొదటిరోజు థియేటర్ కు లేడీస్ ఎక్కువగా వచ్చారు. 'ముకుంద', 'కంచె','లోఫర్' వంటి మూడు విభిన్న చిత్రాల్లో నటించి వరుణ్ పూర్తి స్థాయి హీరో అనిపించుకున్నాడు. భవిష్యత్తులో చిరు, నాగబాబు గారు గర్వపడేలా చేస్తాడు. దిశా పటాని ఈ సినిమాతో పెద్ద హీరోయిన్ అయిపోయింది. సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్'' అని చెప్పారు.

నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ''మంచి సినిమా తీసాననే పేరు తెచ్చిపెట్టిన పూరి గారికి థాంక్స్. వరుణ్ నటించిన మూడు సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ సంపాదించిన సినిమా ఇది. రెవెన్యూ పరంగా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. నైజాంలో 240 థియేటర్లలో విడుదల చేసాం. మరుసటిరోజు భారీ చిత్రాలు విడుదలయిన కలెక్షన్స్ మాత్రం స్టడీగా ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ చాలా సంతోషంగా ఉన్నారు. వరుణ్ బాగా పెర్ఫార్మ్ చేసాడు. సునీల్ గొప్ప మ్యూజిక్ ఇచ్చారు. ముఖ్యంగా అమ్మ పాటకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. సెకండ్ హాఫ్ లో ఉండే మథర్ సెంటిమెంట్ కు అందరు బాగా కనెక్ట్ అవుతున్నారు. పూరి దిశా పటాని లాంటి మరో పెద్ద హీరోయిన్ ను ఇండస్ట్రీకు అందించాడు. రేవతి, పోసాని ల నటన అధ్బుతం. సహకరించిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు.

హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ''సినిమా గురించి వస్తోన్న రిపోర్ట్స్ వింటుంటే చాలా సంతోషంగా ఉంది. అందరం ఓ ఫ్యామిలీలా కలిసి మంచి సినిమా చేశాం. లేడీస్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్'' అని చెప్పారు.

దిశా పటాని మాట్లాడుతూ.. ''ఓ మంచి టీం తో పెద్ద విజయం సాధ్యమైంది. పూరి గారి డైరెక్టర్ గా కంటే ఓ ఫ్రెండ్ లా సపోర్ట్ చేశారు. వరుణ్ మంచి కో యాక్టర్'' అని చెప్పారు.

వరుణ్ తేజ్, దిశా పటాని, బ్రహ్మానందం, రేవతి, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ముకేష్ రుషి, సంపూర్ణేష్ బాబు, సప్తగిరి, పవిత్ర లోకేష్, ఉత్తేజ్, భద్రమ్, శాండీ, ధనరాజ్, టార్జాన్, చరణ్ దీప్, వంశీ, రమ్య తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బి.రవికుమార్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: పి.ఎ.కుమార్ వర్మ, అసోసియేట్ డైరెక్టర్స్: కె.యస్.రాజు, గల్లా రమేష్, కిషోర్ కృష్ణ, కో డైరెక్టర్: శివరామకృష్ణ, కో రైటర్స్: కళ్యాణ్ వర్మ, కిరణ్, ఫైట్స్: విజయ్, సంగీతం: సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, ఆర్ట్: విఠల్ కోసనం, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సమర్పణ: సి.కె.ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్, నిర్మాతలు: సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్, తేజ, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ