Advertisementt

ప్రేక్షకులు కూడా జత కలుస్తారు: అశ్విన్

Sat 19th Dec 2015 09:16 AM
ashwin babu,jatha kalise movie,raju gari gadhi fame,ashwin jatha kalise interview  ప్రేక్షకులు కూడా జత కలుస్తారు: అశ్విన్
ప్రేక్షకులు కూడా జత కలుస్తారు: అశ్విన్
Advertisement

'జత కలిసే' మంచి ఎంటర్ టైనర్- అశ్విన్ బాబు

అశ్విన్ బాబు, తేజస్వి జంటగా నటించిన చిత్రం 'జత కలిసే'. రాకేష్ శశి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వారాహి చలన చిత్రం, ఓక్ ఎంటర్ టైన్మెంట్స్, యుక్త క్రియేషన్స్ పతాకంపై నరేష్ రావూరి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో ‘అలామొదలైంది’ ఫేమ్ స్నిగ్ధ ప్రధానపాత్రలో నటించింది. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో అశ్విన్ బాబు సినిమా విశేషాల గురించి ముచ్చటించారు. 

అశ్విన్ మాట్లాడుతూ....రాజుగారి గదిలో నా పాత్రకు, ఈ సినిమాలో పాత్రకు చాలా తేడా ఉంటుంది. ఈ సినిమా వైజాగ్ నుండి హైదరాబాద్ వరకు జరిగే రోడ్ జర్నీ మూవీ. సినిమాలో రిషి పాత్రలో నటించాను. నాకు తేజస్వి జంటగా నటించింది. దర్శకుడు రాకేష్ ఇంతకు ముందు 'జీనియస్' చిత్రానికి ఓంకార్ అన్నయ్య వద్ద అసోసియేట్ దర్శకుడిగా పనిచేశాడు. అప్పట్నుంచీ మంచి పరిచయముంది. మంచి హార్డ్ వర్కర్. అన్నయ్యకు కథ చెప్పడంతో అన్నయ్య ఓకే చెప్పారు.

ఎంటర్ టైనింగ్ మూవీ. షకలక శంకర్, విద్యులేఖ రామన్, సప్తగిరిలు ఐదారు నిమిషాలు బాగా నవ్విస్తారు. ప్రేక్షకులకు కూడా ప్రయాణం చేసిన ఫీలింగ్ వస్తుంది.  

'రాజుగారి గది' తర్వాత వారాహి సంస్థ నా సినిమాను విడుదల చేస్తుంది. నేను చాలా లక్కీ. మంచి సినిమాలకు వారాహి సంస్థ ప్రోత్సాహం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. విక్కి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సాయి కార్తీక్ 'ఓ ప్రేయసి..' పాటతో పాటు నేపథ్య సంగీతం అందించారు. ఆడియోకి మంచి స్పందన లభించింది. ఆడియో విడుదల రోజున రాజమౌళిగారు రావడంతో హ్యాపీగా ఫీలయ్యా. ఆయన ప్రశంసలు కొత్త కిక్ ఇచ్చాయి. ఇండస్ట్రీకి వచ్చినందుకు ఏదో సాధించాం అనిపించింది...అని అన్నారు.   

పృథ్వీ, షకలక శంకర్, ధనరాజ్, సప్తగిరి, రాజుగారి గది ఫేమ్ విద్యుల్లేఖ రామన్(బుజ్జమ్మ),‘జబర్ దస్త్’ రాంప్రసాద్, సూర్య, ప్రియ  తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా మరి కొంత మంది నూతన నటీనటులు, టెక్నిషియన్స్ కూడా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి సాహిత్యం: అనంత్ శ్రీరామ్, రెహమాన్, డ్యాన్స్: శేఖర్, గణేష్, విజయ్, ఫైట్స్: జాషువ, ఆర్ట్: జె.కె.మూర్తి, పిఆర్ఓ: వంశి- శేఖర్, పబ్లిసిటీ డిజైన్స్: కృష్ణ ప్రసాద్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్,   కెమెరా: జగదీష్ చీకటి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: వైది, సంగీతం: విక్కి, సాయికార్తీక్, నిర్మాత: నరేష్ రావూరి, రచన-దర్శకత్వం: రాకేష్ శశి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement