Advertisementt

'శ్రీవైష్ణవి క్రియేషన్స్‌' చిత్రంకి నాగసుశీల క్లాప్‌!

Thu 17th Dec 2015 05:46 PM
sree vyshnavee creations movie,sree vyshnavee creations movie opening,naga susheela,mantra anand,naveen satya,atluri narayana rao,chintalapudi srinivasa rao  'శ్రీవైష్ణవి క్రియేషన్స్‌' చిత్రంకి నాగసుశీల క్లాప్‌!
'శ్రీవైష్ణవి క్రియేషన్స్‌' చిత్రంకి నాగసుశీల క్లాప్‌!
Advertisement
Ads by CJ

నాగ సుశీల క్లాప్‌తో ప్రారంభమైన 'శ్రీవైష్ణవి క్రియేషన్స్‌' ప్రొడక్షన్‌ నెం 1 చిత్రం 

శ్రీవైష్ణవి క్రియేషన్స్‌ పతాకంపై శ్రీనాగచైతన్య సృజన్‌ సమర్పణలో శశి, చేతన్‌ ప్రధాన పాత్రదారులుగా నవీన్‌సత్య దర్శకత్వంలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెంబర్‌ 1 చిత్రం హైద్రాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అక్కినేని నాగార్జున సోదరి నాగసుశీల క్లాప్‌కొట్టగా, చింతలపూడి శ్రీనివాసరావు కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. 

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నవీన్‌ సత్య మాట్లాడుతూ..'ఇదొక వెరైటీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌. నూతన నటీనటులతో తెరకెక్కనున్న ఈ చిత్రం రోడ్‌ జర్నీ నేపథ్యంలో ఉంటుంది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. హీరోహీరోయిన్‌లతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ నటీనటులు కూడా ఈ చిత్రంలో నటించనున్నారు..' అని అన్నారు. 

చిత్ర నిర్మాత అట్లూరి నారాయణరావు మాట్లాడుతూ..'ముందుగా మమ్మల్నీ ఆశీర్వదించడానికి వచ్చిన నాగసుశీల గార్కి, చింతలపూడి శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు. ఈ చిత్రంలో ప్రేక్షకులకు కావాల్సిన అన్నీ అంశాలు ఉంటాయి. రోడ్‌ జర్నీ నేపథ్యంలో తెరకెక్కే చక్కటి సస్పెన్స్‌ థ్రిల్లర్‌. మా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ ఎమ్‌.వి. కిశోర్‌ ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని భారీగా తెరకెక్కించనున్నాం. డిశంబర్‌ నాలుగోవారం నుండి హైద్రాబాద్‌, బెంగళూర్‌లలో షూటింగ్‌ జరపనున్నాం..' అని అన్నారు. 

సంగీత దర్శకుడు మంత్ర ఆనంద్‌ మాట్లాడుతూ..'రీ-రికార్డింగ్‌కి మంచి స్కోప్‌ ఉన్న చిత్రమిది. సరికొత్త ట్యూన్స్‌తో యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సంగీతాన్ని ఈ చిత్రానికి అందించబోతున్నందుకు ఆనందంగా ఉంది...' అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ ఎమ్‌.వి. కిశోర్‌, డిఓపి అరుణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ