Advertisementt

మరోసారి 'రాధా' లా కాదు కదా!

Wed 16th Dec 2015 06:27 PM
venkatesh,maruthi,babu bangaram,bangaru babu,venkatesh and maruthi movie opening,nayanthara,venki new movie opening matter  మరోసారి 'రాధా' లా కాదు కదా!
మరోసారి 'రాధా' లా కాదు కదా!
Advertisement
Ads by CJ

విక్టరీ వెంకటేష్, మారుతిల క్రేజీ కాంబినేషన్ సినిమా మొదలైంది!

'రాధా' తోనే రావాల్సిన క్రేజీ కాంబినేషన్ సడెన్ గా ఆగిపోయింది. మళ్లీ ఇన్నాళ్ళకు విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో 'సితార ఎంటర్ టైన్మెంట్స్' పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న తాజా చిత్రం ప్రారంభోత్సవం నేడు(DEC16) హైదరాబాద్, ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది. ఎస్.రాధాకృష్ణ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా.. మరో ప్రముఖ నిర్మాత మరియు వెంకటేష్ సోదరులు సురేష్ బాబు కెమెరా స్విచ్చాన్ చేసారు. మొదటి షాట్ కు ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ... 'వెంకటేష్ గారు హీరోగా మారుతిగారి దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించే అవకాశం లభించడం సంతోషకరం. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన నయనతార నటించనున్నారు. ఉత్తమ విలన్, చీకటి రాజ్యం వంటి విభిన్నమైన చిత్రాలకు సంగీతాన్ని సమకుర్సిన జిబ్రాన్ ఈ సినిమాకి స్వర సారధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే మూడు అద్భుతమైన బాణీలు సమకూరాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే విధంగా ఈ చిత్రాన్ని మారుతి తెరకెక్కించనున్నారు. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రాన్ని 2016 ప్రధమార్ధంలో విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం' అన్నారు.

బ్రహ్మానందం, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, పృధ్వి, మురళీశర్మ, దేవ్ గిల్, జయప్రకాష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: SB.ఉద్దవ్, కళ: రమణ వంక, చాయాగ్రహణం: వివేక్ ఆనంద్, సంగీతం: జిబ్రాన్, సమర్పణ: ఎస్.రాధాకృష్ణ, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, రచన-దర్శకత్వం: మారుతి

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ