నిఖిల్ చేతుల మీదుగా ‘భద్రమ్ బి కేర్ ఫుల్ బ్రదరూ’ టీజర్ విడుదల
ముల్లపూడి రామ్‌జీ సమర్పణలో సంపూర్ణేష్‌బాబు, చరణ్, రాజ్, రోషన్, హమీదా ప్రధాన తారాగణంగా సాయివెంకట్ ఎంటర్‌టైన్మెంట్స్, మారుతి టీం వర్క్స్ బ్యానర్స్ పై రూపొందుతోన్న చిత్రం ‘భద్రమ్ బి కేర్ ఫుల్ బ్రదరూ. రాజేష్ పులి దర్శకుడు. బోనం కృష్ణ సతీష్, అడగర్ల జగన్‌బాబు, ఉప్పులూరి బ్రహ్మాజీ నిర్మాతలు. ఈ చిత్ర టీజర్ ను యంగ్ హీరో నిఖిల్ మంగళవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ.. 'కొత్త వారికి అవకాశాలిచ్చినప్పుడు కొంత మందికి అవకాశాలను ఉపయోగించుకోవడం తెలియదు. ఈ చిత్ర నిర్మాతలు నా మిత్రులే. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారని భావిస్తున్నాను. సినిమా బాగా వస్తుంది. అందరినీ అలరిస్తుంది. సంపూర్ణేష్ బాబు మంచి క్యారెక్టర్ చేశాడు'.. అన్నారు.
హీరో నిఖిల్ మాట్లాడుతూ...'మారుతిగారు కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. టీజర్ బావుంది. పెద్ద, చిన్న సినిమాలని ఉండవు. మంచి, చెడు సినిమాలనే ఉంటాయి. ప్రేక్షకులు ఆదరించిన సినిమాలే మంచివి, లేకుండే చెడ్డవి అవుతాయి. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయి ఇందులో నటించిన నటీనటులు, టెక్నిషియన్స్ కు మంచి పేరు తీసుకురావాలి'..అన్నారు.
దర్శకుడు రాజేష్ పులి మాట్లాడుతూ...'దర్శకుడిగా నా సెకండ్ మూవీ ఇది. మారుతిగారు, నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ థాంక్స్..' అన్నారు.
నిర్మాత బోనం కృష్ణ సతీష్ మాట్లాడుతూ...'సినిమా స్టార్ట్ చేయడానికి ముందు మారుతిగారు కథను చెప్పి ఆయన ఓకే చెయ్యగానే సినిమా షూటింగ్‌ను ప్రారంభించాం. మారుతిగారు ఈ సినిమా విషయంలో ఫుల్ సపోర్ట్ చేశారు. రీసెంట్ గా చిన్న చిత్రాలు మంచి సక్సెస్ లను సాధిస్తున్నాయి. భలే భలే మగాడివోయ్, కుమారి 21 ఎఫ్.. లే అందుకు ఉదాహరణలు. అలాగే మా సినిమా కూడా పెద్ద సక్సెస్‌ను సాధిస్తుందనే నమ్మకం ఉంది..' అన్నారు.
ఈ కార్యక్రమంలో చరణ్, రాజ్, రోషన్, హమీదా సహా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు చెప్పారు.
సత్యం రాజేష్, సూర్య, ప్రభాస్ శ్రీను, వేణుగోపాల్, సారిక రామచంద్రరావు, జ్యోతి తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మల్హర్ భట్ జోషి, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, సంగీతం: జెబి, నిర్మాతు: బోనం కృష్ణ సతీష్, అడగర్ల జగన్‌బాబు, ఉప్పులూరి బ్రహ్మాజీ, దర్శకత్వం: రాజేష్ పులి.