Advertisementt

ఒంగోలులో రిలీజ్ చేసిన 'సౌఖ్యం' ఆడియో!

Mon 14th Dec 2015 04:17 PM
soukhyam audio launch,gopichand,regina,ravikumar chowdary  ఒంగోలులో రిలీజ్ చేసిన 'సౌఖ్యం' ఆడియో!
ఒంగోలులో రిలీజ్ చేసిన 'సౌఖ్యం' ఆడియో!
Advertisement
Ads by CJ

గోపీచంద్, రెజీనా జంటగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ఏ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'సౌఖ్యం'. అనూప్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం ఒంగోలులో జరిగింది. హీరో గోపిచంద్  బిగ్‌ సీడీ, ఆడియో సీడీలను ఆవిష్కరించి తొలి కాపీను ఎమ్మెల్యే జనార్ధన్‌ కు అందించారు. ఈ సందర్భంగా..

గోపీచంద్‌ మాట్లాడుతూ.. ''లౌక్యం సినిమా తరువాత భవ్య క్రియేషన్స్ లో చేస్తోన్న మరో చిత్రమిది. నా సొంత బ్యానర్ లా భావిస్తుంటాను. నేను ఈరోజు హీరోగా ఉన్నానంటే ముత్యాల సుబ్బయ్య, ఎం.నాగేశ్వరరావు, చప్పిడి హనుమంతరావు, తిరుపతిరావుగారి వల్లే. లాంగ్ గ్యాప్ తరువాత రవికుమార్ గారితో కలిసి వర్క్ చేస్తున్నాను. కెమెరామెన్‌ ప్రసాద్‌గారు నన్ను చాలా అందంగా చూపించారు. అనూప్‌  మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. రెజీనా చక్కగా నటించింది. ఈ సినిమాతో తనకు మంచి పేరు వస్తుంది శ్రీధర్‌సీపాన లౌక్యం కంటే పెద్ద హిట్‌ కావాలని మంచి కథను అందించారు. కోన వెంకట్, గోపీ మోహన్ ల స్క్రీన్ ప్లే అధ్బుతంగా ఉంటుంది. సపోర్ట్‌ చేసిన నటీనటులు, టెక్నిషియన్స్‌కు థాంక్స్‌'' అని అన్నారు.

ఎ.యస్‌.రవికుమార్‌ చౌదరి మాట్లాడుతూ.. ''మంచి టెక్నిషియన్స్‌తో ఈ సినిమాలో పనిచేసే అవకాశం దొరికింది. శ్రీధర్‌సీపాన లౌక్యం కంటే ఇంకా బెటర్ స్క్రిప్ట్‌ అందించారు. గోపిమోహన్‌ స్క్రీన్ ప్లే, అనూప్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది'' అన్నారు. 

భవ్య ఆనంద్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. '\సినిమా ఫంక్షన్స్‌ను సామాన్య ప్రజల మధ్యలో జరపాలనే ఉద్దేశ్యంతో ఒంగోలులో ఆడియో వేడుకను ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమం సక్సెస్‌ కావడానికి కారణమైన ఎమ్మెల్యే జనార్ధన్‌గారికి, ఎస్‌.పి గారికి థాంక్స్‌. గోపీచంద్‌ తో మా బ్యానర్ కు ఉన్న అనుబంధం ఎప్పటికి కొనసాగాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులు, టెక్నిషియన్స్‌ మంచి సపోర్ట్‌ను అందించారు. అందరికీ థాంక్స్‌'' అని అన్నారు. 

రెజీనా మాట్లాడుతూ.. ''నా పుట్టినరోజును ఒంగోలులో సెలబ్రేట్‌ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన భవ్య క్రియేషన్స్‌ వారికి థాంక్స్‌. రవికుమార్‌ చౌదరితో రెండో సినిమా చేస్తున్నాను. అనూప్‌గారితో కూడా రెండోసారి చేస్తున్నాను. 'దేవ్‌ దేవ్‌ దేవుడా..' నా ఫెవరేట్‌ సాంగ్‌. గోపీచంద్‌ హార్డ్‌ వర్కింగ్‌ హీరో'' అని అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో అన్నేరవి, అనూప్‌, శ్రీధర్‌ సీపాన, ఆర్‌.నారాయణమూర్తి, రఘుబాబు, శంకర్‌ మాస్టర్‌, సుదర్శన్‌, భాస్కరభట్ల, ప్రసాద్‌ మూరెళ్ళ, గౌతంరాజు, శివాజీరాజా, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. 

గోపీచంద్, రెజీనా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో షావుకారు జానకి, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, జయప్రకాష్ రెడ్డి, జీవా, రఘుబాబు, కృష్ణభగవాన్, ముఖేష్ రుషి, దేవా, పృథ్వి, రఘు, శివాజీరాజా, సురేఖావాణి, సత్యకృష్ణ, సత్యం రాజేష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కథ, మాటలు: శ్రీధర్ సీపాన, సంగీతం: అనూప్ రూబెన్స్, స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్ : వివేక్, నిర్మాత: వి.ఆనంద్ ప్రసాద్, డైరెక్టర్: ఏ.ఎస్.రవికుమార్ చౌదరి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ