కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు నిర్మాణ సారథ్యంలో మహేశ్వర ఆర్ట్స్ బ్యానర్‌పై పర్స రమేష్ మహేంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'షీ'. 'ఈజ్ వెయిటింగ్' అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తయిన సందర్భంగా చిత్రబృందం ఆదివారం ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది.
దర్శకుడు పర్స రమేష్ మహేంద్ర మాట్లాడుతూ.. ''ఒక అందమైన ప్రేమకథకు హారర్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మంచి టీమ్ కుదిరింది. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం'' అన్నారు.
చిత్ర నిర్మాత కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు మాట్లాడుతూ.. ''ఈ నెలలో ఒక సేవా కార్యక్రమంతో భారీగా ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నాం. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రెగ్యులర్ షూటింగ్ నిర్వహించి ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.
ఈ చిత్రానికి ఫైట్స్: సతీష్, డ్యాన్స్: ఏర్రోళ్ళ రమేష్, ఆర్ట్: రామకృష్ణ, సంగీతం: భోలే, సినిమాటోగ్రఫీ: అనిత్, లైన్ ప్రొడ్యూసర్: గట్టు విజయ్ గౌడ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బసంత్ రెడ్డి, నిర్మాత: కల్వకుంట్ల తేజేశ్వర్ రావు, కథ, కథనం, మాటలు, దర్శకత్వం: పర్స రమేష్ మహేంద్ర.