Advertisementt

క్రిస్మస్ కానుకగా 'భలే మంచి రోజు'!

Mon 14th Dec 2015 10:27 AM
bhale manchi roju movie release date,sudheer babu,sriram aditya  క్రిస్మస్ కానుకగా 'భలే మంచి రోజు'!
క్రిస్మస్ కానుకగా 'భలే మంచి రోజు'!
Advertisement
Ads by CJ

సుధీర్ బాబు, వామిక జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో విజయ్ కుమార్, శశిధర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'భలే మంచి రోజు'. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిశంబర్ 25న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో..

దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ.. ''ఇది ఒక రోజులో జరిగే కథ. ఉదయం 8 గంటలకు మొదలైతే సాయంత్రం 6 గంటలకు పూర్తవుతుంది. ఆ సమయంలో హీరో ఎవరిని కలిసాడు..? ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనేదే ఈ సినిమా. ఇదొక డిఫరెంట్ జోనర్. రియల్ లోకేషన్స్ లో షూట్ చేశాం. రెగ్యులర్ ఫార్మాట్ చిత్రంలా ఉండదు. రీసెంట్ గా విడుదలయిన పాటలకు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు. ఫ్రెష్ గా ఉంటుంది. డిశంబర్ 25న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. ''చిన్న బడ్జెట్ గా సినిమా మొదలుపెట్టాం. కాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశాం. సన్నీ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సౌండ్ డిజైన్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుంది. శ్యాం దత్ గారి ఫోటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజువల్స్ చాలా బావున్నాయి. ఈ చిత్రాన్ని నైజాంలో దిల్ రాజు గారు, గుంటూరులో యు.వి.క్రియేషన్స్ వారు డిస్ట్రి బ్యూట్ చేస్తున్నారు. ఓవర్సీస్ లో ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. సుదీర్ కెరీర్ లో బిగ్గెస్ట్ రిలీజ్ ఇదే'' అని చెప్పారు.

సుదీర్ బాబు మాట్లాడుతూ.. ''ఈ సంవత్సరంలో నేను నటించిన మూడవ సినిమా రిలీజ్ అవుతుంది. నా బెస్ట్ ఇయర్ ఇది. ఫార్ములా ప్రకారం కాకుండా ప్రయోగాత్మక చిత్రాలు చేయొచ్చని 'ప్రేమ కథా చిత్రం' సినిమా నిరూపించింది. 'భలే మంచి రోజు' కూడా ఒక డిఫరెంట్ జోనర్ కి చెందినది. ఫన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. శశి, విజయ్ నా క్లోజ్ ఫ్రెండ్స్. నా కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ ఫిలిం ఇది. అవుట్ పుట్ బాగా వచ్చింది. శ్రీరామ్ మొదటిసారి డైరెక్ట్ చేశాడు'' అని చెప్పారు.

శ్యాందత్ మాట్లాడుతూ.. ''ఫుల్ ఎంటర్టైనింగ్ సినిమా ఇది. మంచి టీం కుదిరింది. టీం ఎఫర్ట్ పెట్టి చేశాం. డైరెక్టర్ గారు ఇప్పటివరకు ఎవరి దగ్గర పని చేయలేదు. అందుకే అనుకుంట ఆయన ఆలోచనలు చాలా ఫ్రెష్ గా ఉంటాయి. సుదీర్ బాగా ఫ్రీడమ్ ఇచ్చారు. సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో వామికా, ధన్య బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి మ్యూజిక్: సన్నీ ఎం.ఆర్, ఫోటోగ్రఫీ: శ్యాందత్, ఆర్ట్ డైరెక్టర్: రామ కృష్ణ, డైలాగ్స్: అర్జున్, కార్తిక్, కో డైరెక్టర్: శ్రీరామ్ ఎరగంరెడ్డి, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, నిర్మాతలు: విజయ్ కుమార్ రెడ్డి, శశిధర్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య.టి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ