Advertisementt

వికాస్‌ ప్రొడక్షన్స్‌ మూవీ అనౌన్స్‌మెంట్‌!

Sun 13th Dec 2015 03:58 PM
vikas productions,chinna,adari ravikumar,srikanth  వికాస్‌ ప్రొడక్షన్స్‌ మూవీ అనౌన్స్‌మెంట్‌!
వికాస్‌ ప్రొడక్షన్స్‌ మూవీ అనౌన్స్‌మెంట్‌!
Advertisement
Ads by CJ

విహారికా సమర్పణలో వికాస్‌ ప్రొడక్షన్స్‌ నెం.1 బ్యానర్‌పై చిన్నా దర్శకత్వంలో ఆదరి రవికుమార్‌ నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌ ప్రెస్‌మీట్‌ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత వైజాగ్‌లో ప్రారంభించబోయే విల్లాస్‌ బ్రోచర్‌ను హీరో శ్రీకాంత్‌ విడుదల చేయగా, సినిమా బ్రోచర్‌ను శివారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా 

హీరో శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. ''నేను, చిన్నా కలిసి 'మధురానగరిలో' చిత్రంతో మా జర్నీ మొదలుపెట్టాం. అప్పటి నుండి చిన్నాతో మంచి పరిచయముంది. 'ఆ ఇంట్లో' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. మరో మంచి కథతో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఎంటర్టైనింగ్ గా ఉండే ఈ చిత్రం అందరికి మంచి పేరు తీసుకురావాలి'' అని చెప్పారు.

నిర్మాత ఆదరి రవికుమార్‌ మాట్లాడుతూ.. ''నిర్మాతగా ఇది నా మొదటి సినిమా. చిన్న గారు మంచి స్టొరీ సెలక్ట్ చేసుకున్నారు'' అని అన్నారు. 

దర్శకుడు చిన్నా మాట్లాడుతూ.. '' 'ఆ ఇంట్లో' వంటి హర్రర్‌ చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడుగా పరిచయమయ్యి ఆరు సంవత్సరాలు అవుతుంది. మరో మంచి కథ దొరికే వరకు దర్శకత్వం చేయడానికి తొందర పడకూడదని గ్యాప్‌ తీసుకున్నాను. ఆదరి రవికుమార్‌ నేను డైరెక్ట్‌ చేసిన 'ఆ ఇంట్లో' సినిమా చూసి నాతో సినిమా చేస్తానని అన్నారు. మంచి కథ కుదరడంతో సినిమా చేయడానికి రెడీ అయ్యాను. ఇదొక కామెడి సినిమా. కమెడియన్స్‌ అందరూ ఈ చిత్రంలో నటించారు'' అని చెప్పారు.

ఈ చిత్రానికి సంగీతం: కోటి, కెమెరా: ఎన్‌.సుధాకర్‌రెడ్డి, ఎడిటర్‌: కె.వి.కృష్ణారెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బి.వి.నాయుడు, ఆర్ట్‌: వి.శ్రీనివాస్‌రాజు, నిర్మాత: ఆదరి రవికుమార్‌, దర్శకత్వం: చిన్నా. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ