Advertisementt

విడుదలకు సిద్ధమవుతున్న 'వేటపాలెం'!

Sat 12th Dec 2015 11:45 PM
veta palem movie release,venkat reddy,prashanth,lavanya,shilpa  విడుదలకు సిద్ధమవుతున్న 'వేటపాలెం'!
విడుదలకు సిద్ధమవుతున్న 'వేటపాలెం'!
Advertisement
Ads by CJ

మాస్టర్‌ అమరావతి సురోచన్‌ సమర్పణలో హని, ప్రణి ఫిలింస్‌ బ్యానర్‌పై డా.ఎ.వి.ఆర్‌ నిర్మాతగా నంది వెంకట రెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'వేటపాలెం'. ప్రశాంత్‌, లావణ్య, శిల్ప హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో.. 

చిత్ర నిర్మాత డా||ఎ.వి.ఆర్‌ మాట్లాడుతూ.. ''నిర్మాతగా తొలి చిత్రం. దర్శకుడు చెప్పిన కథ బావుంది. కథను నమ్మి చేశాం. మంచి మెసేజ్‌ ఉన్న చిత్రం. దండు పాళ్యం చిత్రాన్ని గుర్తుకు తెస్తుంది. అన్నీ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న చిత్రమిది. డిసెంబర్‌ 27న ఆడియో విడుదల చేసి, జనవరి మొదటి వారంలో సినిమాను రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు. 

దర్శకుడు నంది వెరకటరెడ్డి మాట్లాడుతూ.. ''అనాథ పిల్లలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వారి భవిష్యత్‌ ఎలా ఉంటుంది. వారికి సరైన గైడెన్స్‌ లేకుండా క్రిమినల్స్‌గా కూడా మారుతున్నారు. క్రైమ్‌ నేపథ్యంలో సినిమా ఉంటుంది. గణేష్‌ ముత్యాల మంచి కథను అందించారు. మనసుకు హత్తుకునే సన్నివేశాలుంటాయి. పాటలన్నీ బాగా వచ్చాయి'' అన్నారు. 

ఈ కార్యక్రమంలో ఎ.ఎం.రెడ్డి, మున్నా, శిల్ప తదితరులు పాల్గొన్నారు. 

ఈ చిత్రానికి కెమెరా: డి.యాదగిరి, సంగీతం: ఎ.ఆర్‌.సన్నీ, పాటలు: నర్ల రామకృష్ణారెడ్డి, మాటలు-కోడైరెక్టర్‌: గణేష్‌ ముత్యాల, సహనిర్మాత: తంగిరాల అపర్ణ, నిర్మాత: డా||ఎ.వి.ఆర్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నంది వెంకటరెడ్డి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ