Advertisementt

'అనగనగా ఒక చిత్రమ్' సక్సెస్ మీట్!

Sat 12th Dec 2015 05:19 PM
anaganaga oka chithram movie success meet,siva,meghasri,prabhakar reddy  'అనగనగా ఒక చిత్రమ్' సక్సెస్ మీట్!
'అనగనగా ఒక చిత్రమ్' సక్సెస్ మీట్!
Advertisement
Ads by CJ

శివ, మేఘశ్రీ జంటగా జె ప్రొడక్షన్స్ గోవర్షిణి ఫిలింస్ పతాకాలపై జె.ప్రభాకరరెడ్డి దర్శకత్వంలో జె.ప్రభాకరరెడ్డి, కొడాలి సుబ్బారావు సంయుక్తంగా నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'అనగనగా ఒక చిత్రమ్'. డిశంబర్ 11న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం శనివారం హైదరాబాద్ లోని సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా..

దర్శకుడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ''ప్రేక్షకుల నుండి ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ఇంత మంచి టీం తో కలిసి పనిచేసినందుకు ఆనందంగా ఉంది. మల్లయ్య గారు ఎంతగానో సపోర్ట్ చేసారు. ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లుగా ఓ కొత్త పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సినిమాలో కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు'' అని చెప్పారు.

హీరో శివ మాట్లాడుతూ.. ''మంచి కామెడీ ఎంటర్టైనింగ్ మూవీ ఇది. సాంగ్స్ పిక్చరైజేషన్, కామెడీ హైలైట్స్ గా నిలిచాయి. సక్సెస్ చేసిన ఆడియన్స్ కి థాంక్స్'' అని చెప్పారు.

మేఘశ్రీ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు, సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్'' అని చెప్పారు.

ఈ చిత్రానికి కథ, మాటలు: అజయ్, సంగీతం: వినోద్ యాజమాన్య, సినిమాటోగ్రఫీ: వి.రవికుమార్, ఎడిటింగ్: సాయి, ఆర్ట్: విజయకృష్ణ, స్టిల్స్: బాబు, కాస్ట్యూమ్స్: కె.మురళి, మేకప్: రంగా, నిర్మాణ నిర్వహణ: నల్లూరి శ్రీనివాస్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కొడాలి శ్రీనివాసరావు, ప్రొడక్షన్ మేనేజర్స్: నాగిరెడ్డి, ఆర్.రాంబాబు, అసిస్టెంట్ డైరెక్టర్స్: సుదర్శన్, హరీష్ సజ్జా, అసోసియేట్ డైరెక్టర్స్: ఉమేష్ నాగ, జి.యం.మంజునాథ్, కో`డైరెక్టర్: యస్.నాగశ్రీనివాసరావు, నిర్మాతలు: జె.ప్రభాకరరెడ్డి, కొడాలి సుబ్బారావు, డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జె.ప్రభాకరరెడ్డి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ