హెచ్.హెచ్.మహదేవ్ ఐశ్వర్య అడ్డాల, సిరిశ్రీ, పునర్ణవి భూపాలం ప్రధానపాత్రల్లో పి.యస్.త్రిలోక్ రెడ్డి సమర్పణలో సినీ నిలయ క్రియేషన్స్ ఎల్.ఎల్.పి. బ్యానర్ పై చెందు ముద్దు దర్శకత్వంలో పి.యస్.సూర్యతేజా రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిశంబర్ 11న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా..
వంశీ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో రెండు పాటలకు మ్యూజిక్ కంపోజ్ చేసాను. డైరెక్టర్ చందు నాకు మంచి స్నేహితుడు. సినిమా చూసిన వారందరూ బావుందని చెబుతున్నారు. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
చెందు ముద్దు మాట్లాడుతూ.. ''కథ వినగానే శ్రీరాంరెడ్డిగారు సినిమా చేయమని ప్రోత్సహించారు. ఆయన ఈరోజు లేకపోవడం చాలా బాధగా ఉంది. వంశీగారు ఎంతో అభిమానంతో ఈ సినిమాలో రెండు పాటలకు సంగీతం అందిచడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా ద్వారా కమర్షియల్ హిట్ రావాలని ఆశిస్తున్నాను. ఇదొక క్లీన్ ఎంటర్టైనర్. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్'' అని చెప్పారు.
హెచ్.హెచ్.మహదేవ్ మాట్లాడుతూ.. ''నా రెండో చిత్రానికే వంశీ గారు మ్యూజిక్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సాంగ్స్, సినిమా బాగా వచ్చింది. సినిమాలో మంచి కామెడీ ఉంటుంది. ఎక్కడా వల్గారిటీ అనేది ఉండదు. యూత్ ను, ఫ్యామిలీను ఆకట్టుకునే క్లీన్ మూవీ ఇది. డిశంబర్ 11న విడుదలవుతుంది. మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
సంగీత దర్శకుడు మారుతీరాజా మాట్లాడుతూ.. ''ఈ చిత్రంలో మూడు పాటలకు మ్యూజిక్ అందించాను. నాపై నమ్మకంతో ఈ సినిమాకు పని చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్'' అని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం: వంశీ-మారుతీరాజా, ఎడిటింగ్: వినయ్, లిరిక్స్: శ్రీరామ్ తపస్వి, కెమెరా: జయపాల్ రెడ్డి నిమ్మల, కో ప్రొడ్యూసర్: పిన్నింటి శ్రీరాం సత్యారెడ్డి, ప్రొడ్యూసర్: పి.యస్.సూర్యతేజారెడ్డి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చెందు ముద్దు.