Advertisementt

'వీరి వీరి గుమ్మడిపండు' విడుదల తేదీ ఖరారు!

Wed 09th Dec 2015 06:02 PM
veeri veeri gummadipandu platinum disc function,rudhra,sagar,kiran kumar,vennela  'వీరి వీరి గుమ్మడిపండు' విడుదల తేదీ ఖరారు!
'వీరి వీరి గుమ్మడిపండు' విడుదల తేదీ ఖరారు!
Advertisement
Ads by CJ

రుద్ర, వెన్నెల, సంజయ్ ప్రధాన పాత్రల్లో దుగ్గిన్ సమర్పణలో శివకృతి క్రియేషన్స్ బ్యానర్ పై ఎం.వి.సాగర్ దర్శకత్వంలో కెల్లం కిరణ్ కుమార్ నిర్మించిన చిత్రం 'వీరి వీరి గుమ్మడిపండు'. ఈ చిత్రం ప్లాటినం డిస్క్ వేడుక బుధవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మధురా శ్రీధర్ రెడ్డి ప్లాటినం డిస్క్ లను చిత్ర బృందానికి అందజేశారు. ఈ సందర్భంగా..

మధురా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ''సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో పని చేసే కిరణ్ సినిమాల మీద ప్యాషన్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సోలార్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తుంటారు. సినిమాలో ప్రతి పాట కథలో భాగంగా ఉంది. ఇదొక మంచి స్టొరీ. దర్శక నిర్మాతలకు యూనిట్ సభ్యులకు అభినందనలు'' అని అన్నారు.

దర్శకుడు ఎం.వి.సాగర్ మాట్లాడుతూ.. ''ఇదొక ఫ్యామిలీ హారర్ ఎంటర్టైనింగ్ చిత్రం. కొత్త ఆర్టిస్టులు ఈ చిత్రానికి పనిచేశారు. పి.ఆర్ మంచి సంగీతాన్నందించారు. అందరి సపోర్ట్ తో సినిమాను అనుకున్న సమయంలోనే పూర్తి చేశాం. డిశంబర్ 18న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.

నిర్మాత కెల్లం కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ''సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

సంగీత దర్శకుడు పి.ఆర్  మాట్లాడుతూ.. ''మంచి మ్యూజిక్ కుదిరింది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో రుద్ర, వెన్నెల, సంజయ్, హ్యాపీ తదితరులు పాల్గొన్నారు.

రుద్ర, వెన్నెల, సంజయ్, బంగారం హార్దిక్, రుషిత, రఘుబాబు, శివన్నారాయణ, దీక్షిత్, అనంత్, ప్రవీణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్: శక్తి స్వరూప్, మ్యూజిక్: పి.ఆర్, సినిమాటోగ్రఫీ: కె.యం.కృష్ణ, ప్రొడ్యూసర్: కెల్లం కిరణ్ కుమార్, దర్శకత్వం: ఎం.వి.సాగర్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ