Advertisementt

చిరు మెసేజ్ చేసారు:పూరి జగన్నాథ్!

Tue 08th Dec 2015 10:32 PM
loafer audio launch,varun tej,puri jagannth,prabhas  చిరు మెసేజ్ చేసారు:పూరి జగన్నాథ్!
చిరు మెసేజ్ చేసారు:పూరి జగన్నాథ్!
Advertisement
Ads by CJ

'ముకుంద', 'కంచె' వంటి విభిన్న కథా చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పరుచుకున్న మెగాబ్రదర్ నాగబాబు తనయుడు సుప్రీమ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్ సి.కళ్యాణ్ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్ పతాకంపై సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్, తేజ నిర్మిస్తున్న భారీ చిత్రం 'లోఫర్'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లోని శిల్పకళావేదిక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభాస్ బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించి మొదటి కాపీను రామ్ గోపాల్ వర్మకు అందించారు.

ఈ సందర్భంగా..

ప్రభాస్ మాట్లాడుతూ.. ''వరుణ్ కూడా తన బాబాయ్, పెదనాన్నలా మంచి హీరో అవుతాడు. పూరి గారంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. నేను పూరి గారే బయటకి వెళ్తుంటాం. 'బుజ్జిగాడు' సినిమా కోసం 6 నెలలు వెయిట్ చేసాను. నా ఫేవరెట్ సినిమా అది. హీరో క్యారెక్టరైజేషన్ రాయగలిగే ఒకేఒక్క దర్శకుడు పూరి. రాజమౌళి గారు నేను ఒక సీన్ చేయాలంటే వంద రోజులు పడుతుంది.. అదే పూరి ఒక్క డైలాగ్ లో చెప్పేస్తాడని అంటుంటారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ''ఈశ్వర్ సినిమా నుండి నేను ప్రభాస్ కు పెద్ద అభిమానిని. ఆయన ఈరోజు నా సినిమా ఆడియో ఫంక్షన్ కి రావడం ఆనందంగా ఉంది. ఇంటర్ సెకండ్ ఇయర్ లో పూరి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవుదామని వెళ్లాను. కాని ఈరోజు ఆయన సినిమాలో హీరోగా నటించే అవకాసం వచ్చింది. ఈ సినిమా చేయడానికి కారణం సి.కళ్యాన్ గారు. కథ వినమని నేను కంచె షూటింగ్ లో ఉన్నప్పుడు పిలిపించారు. నేషనల్ అవార్డు గ్రహీత రేవతి గారితో కలిసి పని చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఆమె నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. సునీల్ బ్రిలియంట్ మ్యూజిక్ ఇచ్చాడు. మా ఫ్యామిలీలో హీరోలను చూస్తే చిన్న సైజ్ క్రికెట్ టీం లా అనిపిస్తారు. ప్రతి ఆడియో ఫంక్షన్ కు అందరు రావడం సరికాదని బ్రేక్ తీసుకున్నారు. వారు రాకపోవడానికి మరే కారణం లేదు. నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది'' అని చెప్పారు. 

పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. ''అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి' సినిమా చేసే సమయంలో వర్మ గారు ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్న సినిమాలు ఎందుకు తీస్తావని తిట్టారు. అదే వర్మ గారు 'లోఫర్' సినిమా చూసి 'మా అమ్మ సీతామహాలక్ష్మి' అనే టైటిల్ పెట్టొచ్చు కదా అని అడిగారు. అప్పుడే నేను సక్సెస్ అయ్యాననే ఫీలింగ్ కలిగింది. చాలా సంవత్సరాల తరువాత మదర్ సెంటిమెంట్ ఉన్న సినిమా చేసాను. రేవతి, పోసాని గారు తల్లి తండ్రుల పాత్రల్లో అధ్బుతంగా నటించారు. ఇక వరుణ్ విషయానికొస్తే తను నాకు చిన్నప్పటినుండి తెలుసు. ఎనిమిదేళ్ళ క్రితం అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవ్వడానికి నా దగ్గరకి వచ్చాడు. ఫైనల్ గా తన సినిమా నేను డైరెక్ట్ చేసే చాన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో మథర్ మీద ఉండే ఒక పాటలో వరుణ్ చేసిన నటన చూస్తే చాలు.. తను ఎంత పెద్ద హీరో అవుతాడో చెప్పడానికి. సి.కళ్యాన్ గారు అరవై సినిమాలకు పైగా ప్రొడ్యూస్ చేసారు. ఆయనతో పని చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ఆడియో ఉందని చిరంజీవి గారు నాకు మెసేజ్ ద్వారా ఆయన బ్లెస్సింగ్స్ తెలియజేసారు. ఆయనకు వరుణ్ అంటే చాలా ఇష్టం'' అని చెప్పారు. 

రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ''ప్రతి డైరెక్టర్ కు ఒక కల ఉంటుంది. పూరి పోకిరి, ఇడియట్ మాదిరి రోడ్ మీద తిరుగుతూ.. తనలో ఉన్న క్యారెక్టర్స్ ను సినిమాగా తీస్తున్నాడు'' అని చెప్పారు.

సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ''వరుణ్ మెగా ఫ్యామిలీలో పెద్ద హీరో అవుతాడు. పూరి అనుకున్న సమయంలో అనుకున్న బడ్జెట్ లో సినిమా పూర్తి చేసాడు. సునీల్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాతో తను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు.  టెక్నీషియన్స్ అందరికి థాంక్స్'' అని చెప్పారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. ''ప్రభాస్ కు 'వర్షం' సినిమా తన కెరీర్ లో ఎలా గుర్తుండిపోతుందో.. అలానే వరుణ్ కు 'లోఫర్' అలాంటి సినిమా అవుతుంది. హీరోను ఎలా ప్రెజంట్ చేయాలో పూరికి బాగా తెలుసు. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

రేవతి మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించే అవకాసం ఇచ్చిన పూరి గారికి థాంక్స్. వరుణ్ తో కలిసి వర్క్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది'' అని చెప్పారు.

సునీల్ కశ్యప్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాకు మ్యూజిక్ అందించే అవకాసం ఇచ్చిన దర్శకనిర్మాతలకు నా కృతజ్ఞతలు. భాస్కర్ భట్ల, సుద్దాల అశోక్ తేజ మంచి లిరిక్స్ అందించారు. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. ''వరుణ్ కి మంచి హిట్ సినిమా అవ్వాలి. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

ఆకాష్ పూరి మాట్లాడుతూ.. ''నాన్నగారు కనీసం ముప్పై సినిమాలు చేసి ఉంటారు. ఈ సినిమా కథ విన్నప్పుడు నాన్న నాతో ఇలాంటి సినిమా చేయొచ్చు కదా అనిపించింది. వరుణ్ అన్నయ్య ఈ సినిమాలో బాగా నటించాడు. సినిమా డెఫినిట్ గా పెద్ద హిట్ అవుతుంది'' అని చెప్పారు.

వరుణ్ తేజ్, దిశా పటాని, బ్రహ్మానందం, రేవతి, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ముకేష్ రుషి, సంపూర్ణేష్ బాబు, సప్తగిరి, పవిత్ర లోకేష్, ఉత్తేజ్, భద్రమ్, శాండీ, ధనరాజ్, టార్జాన్, చరణ్ దీప్, వంశీ, రమ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బి.రవికుమార్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: పి.ఎ.కుమార్ వర్మ, అసోసియేట్ డైరెక్టర్స్: కె.యస్.రాజు, గల్లా రమేష్, కిషోర్ కృష్ణ, కో డైరెక్టర్: శివరామకృష్ణ, కో రైటర్స్: కళ్యాణ్ వర్మ, కిరణ్, ఫైట్స్: విజయ్, సంగీతం: సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, ఆర్ట్: విఠల్ కోసనం, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సమర్పణ: సి.కె.ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్, నిర్మాతలు: సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్, తేజ, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్ 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ