Advertisementt

సీతమ్మ అందాలు.. టీజర్ రిలీజ్..!

Tue 08th Dec 2015 03:43 PM
seethamma andalu ramayya sithralu teaser launch,srinivas gavireddy,raj tarun  సీతమ్మ అందాలు.. టీజర్ రిలీజ్..!
సీతమ్మ అందాలు.. టీజర్ రిలీజ్..!
Advertisement
Ads by CJ

రాజ్ తరుణ్, అర్తనా జంటగా శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి పూర్ణిమ.ఎస్.బాబు సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు, కె.వి.శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మిస్తున్న చిత్రం 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు'. సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ చిత్రం టీజర్ ను నటుడు సునీల్ విడుదల చేసారు. లోగోను మారుతి, ఎన్.శంకర్ రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా.. 

సునీల్ మాట్లాడుతూ.. ''రాజ్ తరుణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే తను నటించడు.. బిహేవ్ చేస్తాడు. సినిమా టీజర్ చాలా బావుంది. ఇలాంటి మరిన్ని చిత్రాల్లో రాజ్ తరుణ్ నటించాలని ఆశిస్తున్నాను. అలానే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న శైలేంద్ర బాబు గారికి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. శ్రీనివాస్ మొదటిసారి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో తను పెద్ద డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

మారుతి మాట్లాడుతూ.. ''టీజర్ బావుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీసి చాలా రోజులయ్యింది. రాజ్ తరుణ్ మెల్లమెల్లగా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ను కలుపుకొని తన కెరీర్ లో ముందుకు  వెళ్తున్నాడు. నిజానికి ఈ సినిమా బన్నీ వాసు నిర్మించాల్సింది కాని కుదరలేదు. నేను నా స్నేహితులతో కలిసి రెండు ఏరియాల్లో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఇదొక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టొరీ. బన్నీ తరువాత నాకు బాగా క్లోజ్ అయిన హీరో ఎవరంటే అది రాజ్ తరుణే. మంచి టాలెంట్ ఉన్న పర్సన్. ఈ సినిమా ఖచ్చితంగా అందరికి రీచ్ అవుతుంది. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ''ఇది నా నాల్గవ సినిమా. నా మూడు సినిమాల కంటే చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. శ్రీనివాస్ చెప్పిన కథ బాగా నచ్చడంతో సినిమా చేయాలని డిసైడ్ అయ్యాం. సినిమా అవుట్ పుట్ బాగా రావడానికి కారణం టీం ఎఫర్ట్. గోపి సుందర్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో శైలేంద్ర గారి అబ్బాయి సుమంత్ ఒక పాటలో నటించాడు. తను కన్నడలో పెద్ద స్టార్ అయినా.. ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేసాడు. ప్రస్తుతం సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ జరుగుతుంది. జనవరిలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.

శ్రీనివాస్ గవిరెడ్డి మాట్లాడుతూ.. ''ఇది నా మొదటి సినిమా. కన్నడలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన శైలేంద్ర గారు నన్ను, నేను చెప్పిన కథను నమ్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజ్ తరుణ్ బాగా సపోర్ట్ చేసాడు. ఈ సినిమా కోసం తనను బాగా కష్టపెట్టాను. అర్తనా చాలా చక్కగా నటించింది'' అని చెప్పారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. ''హ్యాట్రిక్ హీరో నటిస్తున్న చిత్రాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. సినిమా రషెస్ బావున్నాయి. అనుకున్న సమయంలో శ్రీనివాస్ ఈ చిత్రాన్ని పూర్తి చేసాడు. త్వరలోనే ఆడియో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్.శంకర్, రాజా రవీంద్ర, కె.ఆర్.రెడ్డి, డార్లింగ్ స్వామి, రణధీర్, విశ్వ తదితరులు పాల్గొన్నారు.

తరుణ్, అర్తన, రణధీర్, రాజా రవీంద్ర, ఆదర్శ్, షకలక శంకర్, మధునందన్, విజయ్, జోగినాయుడు, సురేఖావాణి, శ్రీలక్ష్మి, హేమ, రత్నసాగర్, నవీన్, భార్గవి తదితరలు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, పాటలు: సుద్ధాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, వనమాలి, కృష్ణచైతన్య, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, కెమెరా: విశ్వ, ప్రొడక్షన్ కంట్రోలర్: కొర్రపాటి వెంకటరమణ, సమర్పణ; శ్రీమతి పూర్ణిమ.ఎస్.బాబు, కథ-స్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ