Advertisementt

'శంకరాభరణం' సక్సెస్ మీట్!

Mon 07th Dec 2015 05:17 PM
shankarabharanam success meet,kona venkat,nikhil,udaya nandanavanam  'శంకరాభరణం' సక్సెస్ మీట్!
'శంకరాభరణం' సక్సెస్ మీట్!
Advertisement
Ads by CJ

కోన వెంకట్ సమర్పణలో నిఖిల్, నందిత జంటగా ఉదయ్ నందనవనం దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్, కామెడీ చిత్రం 'శంకరాభరణం'. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాత. డిశంబర్ 4న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సోమవారం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

కోన వెంకట్ మాట్లాడుతూ.. ''ఉదయ్ 12 ఏళ్ళుగా పడ్డ కష్టానికి మంచి రిజల్ట్ వచ్చింది. సినిమా రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే 10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించింది. సప్తగిరి, పృథ్వి లు పండించిన కామెడీను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసారు. నిఖిల్ డైలాగ్స్ చెప్పిన విధానం, తన బాడీ లాంగ్వేజ్ ఫ్రెష్ గా ఉందని అందరు చెబుతున్నారు. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు'' అని చెప్పారు.

ఉదయ్ నందనవనం మాట్లాడుతూ.. ''నాకు దర్శకునిగా అవకాసం ఇచ్చిన కోన వెంకట్ గారికి థాంక్స్. అలానే నాకు సపోర్ట్ చేసిన నా టెక్నీషియన్స్, నటీనటులకు కృతజ్ఞతలు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు'' అని చెప్పారు.

నిఖిల్ మాట్లాడుతూ.. ''నేను ఇప్పటివరకు చాలా సినిమాలు చేసాను కాని మొదటిసారిగా ఈ సినిమా ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేసాను. అనుకున్నట్లుగానే ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు'' అని చెప్పారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ