డిసెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో సుధీర్ బాబు భలే మంచి రోజు గ్రాండ్ రిలీజ్
'ప్రేమ కథా చిత్రం', 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరో సుధీర్ బాబు. ఈ ఎనర్జిటిక్ హీరో నటించిన భలే మంచి రోజు చిత్ర పాటలు ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్ర పాటలకు, ట్రైలర్ కు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదే ఊపుతో చిత్ర బిజినెస్ కు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాల్ని అందుకునేందుకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ 25న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనున్నట్టు నిర్మాతలు తెలియజేశారు. వామిఖ ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమౌతోంది. 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ రెడ్డి, శశిథర్ రెడ్డి లు సంయుక్తంగా, శ్రీరామ్ ఆదిత్య ని దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు.
డిసెంబర్ 25న భలే మంచి రోజు చిత్రం విడుదలౌతున్న సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.... సుధీర్‌బాబు, వామిఖ జంటగా మా మిత్రుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న భలే మంచి రోజు చిత్ర పాటలకు, ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. 'స్వామిరారా', 'ఉయ్యాల జంపాల' చిత్రాలకి సంగీతం అందించిన సన్ని.యమ్.ఆర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. లక్కీ హ్యాండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆడియో రిలీజ్ చేసిన తర్వాత ట్రేడ్ వర్గాల్లోనూ... భారీ క్రేజ్ క్రియేట్ చేసింది. ఈ ఉత్సాహంతోనే చిత్ర బిజినెస్ కు క్రేజీ ఆఫర్స్ వస్తుండడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్లలో డిసెంబర్ 25న భలే మంచి రోజు చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నాం. సాయి కుమార్ గారి క్యారెక్టర్ సినిమాకే హైలైట్ కానుంది. ఒక్క రోజులో జరిగే కథనంతో ఆద్యంతం ఆసక్తికరమైన సన్నివేశాలతో తెరకెక్కించాం. 'ఉత్తమవిలన్',' విశ్వరూపం' చిత్రాలకి ఛాయాగ్రహణం అందించిన షామ్‌దత్(shamdut)సినిమాటోగ్రఫి అందించారు. అని అన్నారు.
కెమెరా- షామ్‌దత్, సంగీతం- సన్ని.యమ్.ఆర్, ఆర్ట్- రామకృష్ణ, మాటలు-అర్జున్ అండ్ కార్తిక్, ఎడిటింగ్-యమ్.ఆర్.వర్మ, కో-డైరక్టర్- శ్రీరామ్ రెడ్డి.