తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మంచికి కట్టుబడి, న్యాయానికి నిలబడేవారికి సరైన స్థానం, మనుగడ ఉండదు. ప్రత్యేకంగా అటువంటి గుణాలున్న నిర్మాతలకైతే మరిన్ని కష్టాలు తప్పనవే నానుడి ఎప్పటి నుండో ఉంది. కేవలం వ్యాపార ధోరణి తప్ప చేసే పని పట్ల ప్యాషన్ లేకపోవడం వల్ల కూడా అలా వచ్చి ఇలా తెరమరుగయ్యే చాలా మంది నిర్మాతలకు ఇక్కడి కష్టాలే తప్ప ఇష్టాలు కనబడవు. కానీ సినిమాని కళా దృష్టితో చూస్తూ, తమ అభిరుచినే బిజినెసుగా మార్చుకున్న నిర్మాతలలో సక్సెస్ శాతం ఎప్పుడూ ఆశాజనకంగానే ఉంటుంది. అలాంటి మంచి కోవకే చెందిన మంచి వ్యక్తిగా బెంగాల్ టైగర్ నిర్మాత రాధా మోహన్ గారిని యావత్ పరిశ్రమ అభిమానిస్తోంది.
రాజమండ్రిలో పుట్టి పెరిగిన రాధా మోహన్ గారు ప్రతిష్టాత్మకమైన REC నుండి ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి, కెన్యాలో ఆటోమొబైల్ వ్యాపారం చేస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించారు. సినిమాకున్న అయస్కాంత శక్తి ఎటువంటిదో తెలియనిది కాదు. అక్కడ కెన్యాలో ఉన్నా ఇక్కడ టాలివుడ్ మీదే రాధా గారి మనసంతా ఉండడంతో మెల్లిగా నిర్మాణ రంగం వైపు దృష్టి మరల్చి చిన్న నిర్మాతగా పెద్ద గుర్తింపు పొందారు. సత్యసాయికి పరమ భక్తుడైన ఈయన చిత్ర పరిశ్రమ బాగుకోరి, బెంగాల్ టైగర్ విడుదలను తోటి నిర్మాతల శ్రేయస్సు కోసం వాయిదా వేసిన తీరు ఆయనలోని మంచి మనసుకు దర్పం పట్టింది.
తీసింది మొదటి భారీ బడ్జెట్ సినిమా అయినా, ప్రొడక్షన్ నుండి విడుదల, పబ్లిసిటీ ప్లానింగ్ వరకు అన్నింటా ప్రొఫెషనలిజం కనబరుస్తూ టాలీవుడులో కూడా ఇలాంటి వర్క్ ఫ్లో పాటిస్తే సత్ఫలితాలు వస్తాయని నిరూపించేందుకు మంచి తార్కాణంగా నిలిచారు. అంతే కాకుండా, సినిమా వాళ్లతో డబ్బుల యవ్వారం అంటే భయపడిపోయే ఈ జమానాలో పేమెంట్స్ విషయంలో సైతం రాధామోహన్ గారి ఖచ్చితత్వం కొత్త పుంతలు తొక్కింది అని ఫైనాన్షియర్స్, బయ్యర్స్ కీర్తిస్తున్నారు. చదువు విజ్ఞ్యతను నేర్పిస్తే, అభిరుచి మరియు అంకిత భావం అతన్ని అందరివాడిని చేసాయి. బెంగాల్ టైగర్ విజయంతో రాధా మోహన్ గారు టాలివుడుకి దొరికిన మరో హైలీ క్వాలిఫైడ్, తరో ప్రొఫెషనల్ ప్రొడ్యూసరుగా నిలబడాలని, ఆయన నుండి మరిన్ని భారీ బడ్జెట్ సినిమాలు రావాలని అభిలషిస్తూ... లెట్ అజ్ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్.