Advertisement

'అనగనగా ఒక చిత్రమ్' విడుదలకు సిద్ధం!

Sat 05th Dec 2015 05:10 PM
anaganaga oka chithram,december 11th release,prabhakar reddy,siva,meghasree  'అనగనగా ఒక చిత్రమ్' విడుదలకు సిద్ధం!
'అనగనగా ఒక చిత్రమ్' విడుదలకు సిద్ధం!
Advertisement

శివ, మేఘశ్రీ జంటగా జె ప్రొడక్షన్స్, గోవర్షిణి ఫిలింస్ పతాకాలపై జె.ప్రభాకరరెడ్డి దర్శకత్వంలో జె.ప్రభాకరరెడ్డి, కొడాలి సుబ్బారావు సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'అనగనగా ఒక చిత్రమ్'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిశంబర్ 11న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా..

దర్శకుడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ''అజయ్ అందించిన మాటలు, వినోద్ యాజమాన్య మ్యూజిక్ సినిమాకు హైలైట్స్ గా నిలుస్తాయి. ఈ చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీకు శివ లాంటి మంచి హీరో దొరుకుతాడు. మేఘశ్రీ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. డిశంబర్ 11న సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

కొడాలి సుబ్బారావు మాట్లాడుతూ.. ''ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్ అవుతుంది. మూడు పాటలను యూరప్ లో చిత్రీకరించాం. ఫ్యామిలీతో చుదగడ్డ సినిమా. ఎక్కడా అశ్లీలత అనేది ఉండదు. ఇదొక వింత ప్రేమ కథ. డిశంబర్ 11న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

మల్లిఖార్జున రావు మాట్లాడుతూ.. ''ప్రభాకర్ చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మంచి డైలాగ్స్, పాటలు కుదిరాయి. సినిమా మంచి సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

హీరో శివ మాట్లాడుతూ.. ''వినోద్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. అందరం కష్టపడి పని చేశాం. డైరెక్టర్ గారు క్లారిటీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో అజయ్, మేఘ శ్రీ, సింహ, ప్రభాస్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. 

ఈ చిత్రానికి కథ, మాటలు: అజయ్, సంగీతం: వినోద్ యాజమాన్య, సినిమాటోగ్రఫీ: వి.రవికుమార్, ఎడిటింగ్: సాయి, ఆర్ట్: విజయకృష్ణ, స్టిల్స్: బాబు, కాస్ట్యూమ్స్: కె.మురళి, మేకప్: రంగా, నిర్మాణ నిర్వహణ: నల్లూరి శ్రీనివాస్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కొడాలిశ్రీనివాసరావు, ప్రొడక్షన్ మేనేజర్స్: నాగిరెడ్డి, ఆర్.రాంబాబు, అసిస్టెంట్ డైరెక్టర్స్: సుదర్శన్, హరీష్ సజ్జా, అసోసియేట్ డైరెక్టర్స్: ఉమేష్ నాగ, జి.యం.మంజునాథ్, కో`డైరెక్టర్: యస్.నాగశ్రీనివాసరావు, నిర్మాతలు: జె.ప్రభాకరరెడ్డి, కొడాలి సుబ్బారావు, డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జె.ప్రభాకరరెడ్డి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement