Advertisementt

'బెంగాల్ టైగర్' వణికిస్తుందట..!

Tue 01st Dec 2015 01:15 PM
bengal tiger platinum disc function,raviteja,sampath nandi,thamanna,radhamohan  'బెంగాల్ టైగర్' వణికిస్తుందట..!
'బెంగాల్ టైగర్' వణికిస్తుందట..!
Advertisement
Ads by CJ

మాస్ మహరాజ రవితేజ కథానాయకుడిగా, తమన్నా, రాశిఖన్నాలు కథానాయికలుగా, సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న చిత్రం బెంగాల్ టైగర్. కె.కె రాధామోహన్ నిర్మాత. ఈ చిత్రం ప్లాటినం డిస్క్ ఫంక్షన్ సోమవారం హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో జరిగింది. దర్శకుడు సంపత్ నంది, నిర్మాత రాధామోహన్ చిత్ర బృందానికి ప్లాటినం డిస్క్ లను అందజేశారు. ఈ సందర్భంగా..

హీరో రవితేజ మాట్లాడుతూ.. ''సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ కు కంగ్రాట్స్. సంపత్ కు ఈ సినిమా హ్యాట్రిక్ అవ్వాలని, ప్రొడ్యూసర్ కు మంచి లాభాలు రావాలని ఆశిస్తున్నాను. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు. 

దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ.. ''సినిమా పాటలను ఇంత పెద్ద సక్సెస్ చేసిన రెండు రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు. ఇదొక మంచి ఎంటర్టైనింగ్ మూవీ. డిశంబర్10న రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ఖచ్చితంగా బాక్సాఫీస్ ను వణికిస్తుంది. భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కు సినిమా బాగా కనెక్ట్ అవుతుంది'' అని చెప్పారు.   

నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ.. ''నాకు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాసం ఇచ్చిన హీరో రవితేజ గారికి థాంక్స్. సంపత్ తో నేను ఇదివరకే కలిసి పని చేసాను. 'బెంగాల్ టైగర్' సినిమా అవుట్ పుట్ విషయంలో సంపత్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

తమన్నా మాట్లాడుతూ.. ''డిశంబర్ 10న సినిమా రిలీజ్ అవుతుంది. భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆడియో ఎంత పెద్ద హిట్ అయిందో.. సినిమా కూడా అంత పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను'' అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ.. ''ఆడియో ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. ఈ క్రెడిట్ అంతా.. రైటర్స్, సింగర్స్, టెక్నీషియన్స్ కే చెందుతుంది. ఆడియోలానే సినిమా కూడా మంచి హిట్ కావాలని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ.. ''రవితేజ గారి దుబాయ్ శీను సినిమాకు పాటలు రాసాను. నన్ను కమర్షియల్ ఎస్టాబ్లిష్ చేసిన సినిమా అది. మరోసారి ఆయనతో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో సంపత్ గారు నాతో టైటిల్ సాంగ్ రాయించారు. బీమ్స్ మంచి మ్యూజిక్ కంపోజ్ చేసాడు. తనకు ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుంది'' అని చెప్పారు.

మల్టీడైమెన్షన్ వాసు మాట్లాడుతూ.. ''రేడియో లో, ఐ ట్యూన్స్ లో పాటలు టాప్ పొజిషన్ లో ఉన్నాయి. రవితేజ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ గా నిలుస్తుంది. ఎంతో కేర్ తీసుకొని, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో రాశిఖన్నా, రామ్ లక్ష్మణ్, భాస్కర్ భట్ల, జానీ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: డి.వై.సత్యనారాయణ, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, సంగీతం: భీమ్స్, నిర్మాత: కె.కె.రాధామెహన్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే -దర్శకత్వం: సంపత్ నంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ