Advertisementt

'నేటి విజేతలు' పాటలు విడుదల!

Mon 30th Nov 2015 05:31 PM
neti vijethalu movie audio launch,sudhakar,karunakaran  'నేటి విజేతలు' పాటలు విడుదల!
'నేటి విజేతలు' పాటలు విడుదల!
Advertisement
Ads by CJ

యస్ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీమతి సరిత తిరువీధుల సమర్పణలో సుధాకర్ తిరువీధుల సహ నిర్మాతగా హేరీ ఫెర్నాండెజ్ దర్శకత్వంలో భోజ్ పురిలో అఖండ విజయం సాదించిన 'ఆజ్ కే కరణ్ అర్జున్' చిత్రాన్ని నిర్మాత ఆర్.కె. 'నేటి విజేతలు'గా తెలుగులోకి అనువదించారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ప్రతాని రామకృష్ణ గౌడ్ బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించి మొదటి కాపీను డి.ఎస్.రావు కు అందించారు. ఈ సందర్భంగా..

ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ''భోజ్ పురిలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు. పాటలు చాలా బావున్నాయి. చిన్న చిత్రాలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఛాంబర్ లో ఓ కమిటీను ఏర్పాటు చేసారు. ఆ కమిటీ తరఫున ఈ చిత్రానికి థియేటర్ల విషయంలో సహాయం చేస్తాను. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.

డి.ఎస్.రావు మాట్లాడుతూ.. ''పాటలు ఎనర్జిటిక్ గా ఉన్నాయి. ఈ సినిమా పెద్ద విజయం సాధించి నిర్మాత మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

నిర్మాత సుధాకర్ మాట్లాడుతూ.. ''అద్భుతమైన పోరాటాలతో తొమ్మిది పాటలతో అందర్నీ అలరించేలా ఈ చిత్రం ఉంటుంది. రెండు ఐటమ్ సాంగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. యాక్షన్, కామెడీ, మ్యూజిక్ ఎంటర్టైనర్ చిత్రమిది. చిత్రం క్వాలిటీని చూసి క్రేజీ ఆఫర్ ఇచ్చి కొనడం జరిగింది. గీతామాధురి, శ్రీకృష్ణ, దీపు, ఉమా నేహ, శ్రీకాంత్, గాయత్రిలతో పాటలు పాడించాం. పాటల చిత్రీకరణ స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు ధీటుగా ఉంటుంది. కరుణాకర్ మంచి సంగీతం అందించారు. ఆర్.కె రాసిన మాటలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. భోజ్ పురిలో సూపర్ స్టార్స్ దినేష్ లాల్, ప్రవేశ్ లాల్ మంచి పెర్ఫామెన్స్ ఇచ్చారు. హీరోయిన్లుగా పాకిహెగ్డే, క్రిషా ఖండేల్కర్ నటించారు. నీలిమాసింగ్, సీమాసింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. త్వరలోనే సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ కరుణాకర్ మాట్లాడుతూ.. ''భోజ్ పురి సినిమాల్లో ఉండే పాటలన్నీ మాస్ ఎలివేషన్ తో ఉంటాయి. తెలుగులో కూడా ఈ పాటలను చాలా ఎనర్జిటిక్ గా రూపొందించాం. ప్రేక్షకులకు నచ్చే చిత్రమవుతుంది'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సురేష్, నాగరాజ్, ఆర్.కె తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ