Advertisementt

ఇక సె లవ్ టీజర్ లాంచ్..!

Mon 30th Nov 2015 11:03 AM
ika say love teaser launch,nagaraju,chandrasekhar,sai ravi  ఇక సె లవ్ టీజర్ లాంచ్..!
ఇక సె లవ్ టీజర్ లాంచ్..!
Advertisement
Ads by CJ

సాయి రవి, దీప్తి హీరో, హీరోయిన్లుగా గ్రీన్ సన్ ఇన్నోవేటివ్స్, జైహిత క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మాత గన్నవరపు చంద్రశేఖర్ నిర్మిస్తున్న చిత్రం 'ఇక సె...లవ్'. ఈ చిత్రం ద్వారా డుంగ్రోత్ నాగరాజ్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఈ చిత్రం టీజర్, ఫస్ట్ లుక్ ను సి.కళ్యాణ్, మారుతి ఆదివారం హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా..

సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ''నాగరాజ్ ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటాయి. ఐ.ఏ.ఎస్ పాస్ అయిన తను సినిమాల మీద ఆసక్తితో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఈ సినిమా మంచి విజయం సాధించి నాగరాజ్ ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. మంచి టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేశారు. ఈ సినిమాలో భారతీరాజా, పెద్ద వంశీ షాట్స్ కనిపిస్తాయి. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

మారుతి మాట్లాడుతూ.. ''నాగరాజ్ సింగిల్ లైన్ లో కథ చెప్పగానే బాగా నచ్చింది. టీజర్ లో విజువల్స్ చాలా బావున్నాయి. నిర్మాతలు ఎంతో ప్యాషనేట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మ్యూజిక్ హంటింగ్ గా ఉంది. టైటిల్ రెండు ఎమోషన్స్ కలిసేలా.. పెట్టారు. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

దర్శకుడు నాగరాజ్ మాట్లాడుతూ.. ''గ్లోబలైజేషన్ నేపధ్యంలో అన్ని బంధాలు యాంత్రికంగా మారిపోయినా, కాల దోషం పట్టని ఒకే ఒక్క బంధం ప్రేమ. అటువంటి స్వచ్చమైన ప్రేమ నేపధ్యంలో ఈ   చిత్రాన్ని రూపొందించాను. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

నిర్మాత గన్నవరపు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ''సినిమా సెన్సార్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబర్ 2వ వారంలో ఆడియో, నాల్గవ వారంలో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఖమ్మం, హైదరాబాద్, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించాం'' అని చెప్పారు.

ఈ చిత్రానికి ఎడిటింగ్: నాగిరెడ్డి, కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి, పబ్లిసిటీ డిజైనర్: ధని యేలే, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: బాలకృష్ణ, సంగీతం: మధు.డి, నిర్మాతలు: గన్నవరపు చంద్రశేఖర్, పీర్యా నాయక్, రవి గ్యార, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: డుంగ్రోత్ నాగరాజ్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ