'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రకుల్ 'లౌక్యం' సినిమాతో మంచి ఫాం లోకి వచ్చింది. 'కరెంట్ తీగ, పండగ చేస్కో, కిక్ 2, బ్రూస్ లీ' చిత్రాలతో వరుస ఆఫర్లను చేజిక్కించుకుంది. ఈ అమ్మడు నటించిన చిత్రాలకు ఏవరేజ్ టాక్ వచ్చినా.. తనకు అవకాశాలు రావడం మాత్రం మానట్లేదు. బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న 'సరైనోడు' చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ఎంపికైంది. 'బ్రూస్ లీ, సరైనోడు' చిత్రాల తరువాత ఈ భామను మరో మెగా ఛాన్స్ వరించింది.
'ముకుంద','కంచె' వంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించిన హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం పూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లోఫర్' చిత్రంలో నటిస్తున్నాడు. వరుణ్ తేజ్ నటించబోయే తదుపరి చిత్రానికి హీరోయిన్ గా రకుల్ ను కన్ఫర్మ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయనున్నాడు. 'పండగ చేస్కో' చిత్రంలో రకుల్ పెర్ఫార్మన్స్ నచ్చడంతో గోపీచంద్ ఈ చిత్రానికి కూడా తననే సెలెక్ట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రంతో అయినా.. రకుల్ ను విజయం వరిస్తుందో.. లేదో చూడాలి..!