Advertisementt

దేవిశ్రీ ను హీరోని చేస్తున్న 'కుమారి 21 ఎఫ్'!

Sat 28th Nov 2015 01:40 PM
kumari 21f success meet,sukumar,devisriprasad,surya prathap  దేవిశ్రీ ను హీరోని చేస్తున్న 'కుమారి 21 ఎఫ్'!
దేవిశ్రీ ను హీరోని చేస్తున్న 'కుమారి 21 ఎఫ్'!
Advertisement
Ads by CJ

హేబా పటేల్, రాజ్ తరుణ్ జంటగా సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మించిన చిత్రం 'కుమారి 21 ఎఫ్'. ఇటీవల విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

దిల్ రాజు మాట్లాడుతూ.. ''సుకుమార్ మంచి కంటెంట్ ఉన్న సినిమాలు రాయగలడు. కథల కంటే మంచి సన్నివేశాలు రాస్తాడు. ప్రస్తుతం యువత ఎలా ఉన్నారో.. దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలో సుక్కు అలాంటి సన్నివేశాలే రాశాడు. క్లైమాక్స్ లో నిజాన్ని అర్ధం చేసుకుంటే జీవితం బావుంటుందని తను చెప్పాలనుకున్న పాయింట్ ను చక్కగా ప్రెజంట్ చేసాడు. రాజ్ తరుణ్ ఆర్టిస్ట్ గా మంచి స్థాయికి ఎదుగుతాడు. రత్నవేలు గొప్ప టెక్నీషియన్. 'ఆర్య' సినిమా నుండి దేవిశ్రీ తో ట్రావెల్ చేస్తున్నాను. నా బ్యానర్ లో ఐదు హిట్స్ ఇచ్చాడు. సెకండ్ హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నాం. ఈ మధ్య దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో తను హీరోగా నటించాలనుకుంటున్నాడని చదివాను. దేవిను మా బ్యానర్ ద్వారా పరిచయం చేయాలని భావిస్తున్నాను. అది కూడా సుకుమార్ డైరెక్షన్ లోనే. సుకుమార్ తీసిన 'ఆర్య' అప్పుడు ఎలాంటి ట్రెండ్ సృష్టించిందో అందరికి తెలిసిందే. ఆలాంటి మంచి కాన్సెప్ట్ తో సినిమా తీస్తాను. ఈ చిత్రానికి రత్నవేలు ఛాయాగ్రహణం అందిస్తారు'' అని చెప్పారు.

సుకుమార్ మాట్లాడుతూ.. ''నా సినిమాలపై దిల్‌రాజుకు గట్టి నమ్మకం. 'కుమారి21'తో కలిపి నాకు సంబంధించిన నాలుగు చిత్రాల్ని ఆయన పంపిణీ చేశారు. నేను నిర్మాతగా రూపొందిన 'కుమారి 21ఎఫ్' ను కూడా దిల్‌రాజు పంపిణీ చేశాడు. ఇక ఇండియాలో మ్యూజిక్ షోస్‌లో స్టెప్స్‌వేసి రాక్ చేసే ఏకైక సంగీత దర్శకుడు ఎవరైనా వున్నారంటే అతను దేవిశ్రీప్రసాద్ మాత్రమే. దేవి సంగీతం, రత్నవేలు ఫోటోగ్రఫీ, సూర్యప్రతాప్ దర్శకత్వం ఈ చిత్ర విజయానికి దోహదపడ్డాయి'' అని చెప్పారు.

దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. ''సుకుమార్ నమ్మకమే ఈ సినిమా. రత్నవేలు ఫోటోగ్రఫీ ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్‌గా నిలిచింది. ఈ సినిమాకు దిల్‌రాజు తోడవ్వడంతో మరింత బలం పెరిగింది. సూర్యప్రతాప్ చాలా చక్కగా తెరకెక్కించాడు. ఇంత మంది కలిసి చేసిన ఈ సినిమా సక్సెస్ కావడం నేను మర్చిపోలేని రోజు ఇది. నిర్మాతల్లో శిఖరం లాంటి వ్యక్తి దిల్ రాజు, దర్శకుల్లో శిఖరం సుకుమార్, కెమెరామెన్‌లలో శిఖరం రత్నవేలు ఈ ముగ్గురు నన్ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా చేస్తామని చెప్పడం ఆనందంగా వుంది'' అని అన్నారు. 

దర్శకుడు సూర్య ప్రతాప్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాతో నన్ను దర్శకుడిగా నిలబెట్టిన సుకుమార్‌కు జన్మజన్మలు రుణపడి వుంటాను'' అని అన్నారు 

ఈ వేడుకలో రాజ్ తరుణ్, రత్నవేలు, విజయ్‌కుమార్ బండ్రెడ్డి, థామస్‌రెడ్డి, హేభా పటేల్, హేమ, కమల్,భాను, నోయెల్, సకుమార్ గురువు డా. రామ్మోహన్‌రెడ్డి, సహనిర్మాత రవి, గిరి, సాయి సుధీర్, శేషు కుమార్ తదితరులు పాల్గొన్నారు.    

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ