గోపీచంద్, రెజీనా జంటగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ఏ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'సౌఖ్యం'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా..
దర్శకుడు ఏ.ఎస్.రవికుమార్ చౌదరి మాట్లాడుతూ.. ''సినిమా స్క్రిప్ట్, నిర్మాత ప్లానింగ్ పక్కగా ఉండడం వలనే మేము అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేయగలిగాం. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. గోపీచంద్ గారి స్వస్థలమైన ఒంగోలు ప్రాంతంలో డిసెంబర్ 13న ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. గోపీచంద్ గారు నటించిన లౌక్యం సినిమా ఆడియో విజయవాడలో నిర్వహించారు. దానికి మించిన విధంగా ఈ సినిమా ఆడియో కూడా నిర్వహించనున్నాం. ప్రస్తుతం ఫైనల్ మిక్సింగ్ వర్క్ జరుగుతోంది. అనూప్ రూబెన్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమాలో మూడు పాటలను స్విట్జర్ లాండ్ లో చిత్రీకరించాం. శ్రీధర్ సీపాన కథ, మాటలు అందించి ఎంతో హెల్ప్ చేసాడు. ప్రసాద్ గారి ఫోటోగ్రఫీ చాలా మెచ్యూర్డ్ గా ఉంటుంది. టెక్నీషియన్స్ అంతా కష్టపడి వర్క్ చేసారు'' అని చెప్పారు.
గోపీచంద్ మాట్లాడుతూ.. ''లౌక్యం సినిమా తరువాత భవ్య క్రియేషన్స్ లో చేస్తోన్న మరో చిత్రమిది. ఒక సాంగ్ మినహా మిగిలిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి. లాంగ్ గ్యాప్ తరువాత రవికుమార్ గారితో కలిసి వర్క్ చేస్తున్నాను. కామెడీను, ఎమోషన్స్ ను ఎలా క్యారీ చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఇదొక మంచి కుటుంబ కథా చిత్రం. కోన వెంకట్, గోపీ మోహన్ ల స్క్రీన్ ప్లే అధ్బుతంగా ఉంటుంది. రెజీనా చక్కగా నటించింది. ఈ సినిమాతో తనకు మంచి పేరు వస్తుంది. సినిమా, పాటలు బాగా వచ్చాయి. డిసెంబర్ 25న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అందరికి నచ్చే చిత్రమవుతుంది'' అని చెప్పారు.
రెజీనా మాట్లాడుతూ.. '' 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమా తరువాత రవికుమార్ గారితో మరోసారి కలిసి వర్క్ చేసే అవకాసం లభించింది. ఈ చిత్రంలో భాగమయినందుకు చాలా సంతోషంగా ఉంది. అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. 'దేవుడా దేవుడా' నా ఫేవరెట్ సాంగ్. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా ఇది. గోపీచంద్ గారితో కంఫర్టబుల్ గా వర్క్ చేసాను'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో శ్వేతా భరద్వాజ్, శంకర్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.
గోపీచంద్, రెజీనా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో షావుకారు జానకి, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, జయప్రకాష్ రెడ్డి, జీవా, రఘుబాబు, కృష్ణభగవాన్, ముఖేష్ రుషి, దేవా, పృథ్వి, రఘు, శివాజీరాజా, సురేఖావాణి, సత్యకృష్ణ, సత్యం రాజేష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కథ, మాటలు: శ్రీధర్ సీపాన, సంగీతం: అనూప్ రూబెన్స్, స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్ : వివేక్, నిర్మాత: వి.ఆనంద్ ప్రసాద్, డైరెక్టర్: ఏ.ఎస్.రవికుమార్ చౌదరి.