Advertisementt

బాహుబలి 2కి రంగం సిద్ధమయింది.!

Thu 26th Nov 2015 02:30 PM
prabhas new movie bahubali2,bahubali2 shooting from december 14th,bahubali2 shooting in ramoji film city,bahubali2 in 2016,bahubali the conclusion  బాహుబలి 2కి రంగం సిద్ధమయింది.!
బాహుబలి 2కి రంగం సిద్ధమయింది.!
Advertisement
Ads by CJ

ప్రభాస్‌, రాజమౌళి కాంబినేషన్‌లో అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన బాహుబలి తర్వాత ఇప్పుడు ఆ చిత్రం రెండో భాగానికి సంబంధించిన షూటింగ్‌కి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు రాజమౌళి. డిసెంబర్‌ 14న ఈ చిత్రం షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రారంభిస్తున్నారు. బాహుబలి షూటింగ్‌ జరుగుతున్నప్పుడే పార్ట్‌ 2కి సంబంధించి 30 శాతం షూట్‌ చేశామని రాజమౌళి గతంలో చెప్పాడు. అయితే ఇప్పుడా ఫుటేజ్‌ని వాడుతున్నారా? లేక ఫ్రెష్‌గా మొత్తం తీస్తారా? అని అడిగితే ఆ 30 పర్సెంట్‌ని యాజిటీజ్‌గా పార్ట్‌2లో వాడుతున్నామని చెప్తున్నాడు రాజమౌళి. స్క్రిప్ట్‌ పరంగా ఫస్ట్‌ పార్ట్‌ కంటే సెకండ్‌ పార్ట్‌ చాలా స్ట్రాంగ్‌గా వుంటుందన్న విషయాన్ని ముందుగానే వెల్లడించాడు రాజమౌళి. అయితే బాహుబలిలో కంటెంట్‌ లేదన్న విమర్శలు కూడా రావడంతో సెకండ్‌ పార్ట్‌ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 

ఇక హీరో ప్రభాస్‌, హీరోయిన్‌ అనుష్కల ఫిట్‌నెస్‌ విషయానికి వస్తే ఇప్పటికే రెండు నెలలుగా తన ఫిట్‌నెస్‌ కోసం కసరత్తులు చేస్తున్న ప్రభాస్‌ అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్‌కి తగ్గట్టుగా తయారయ్యాడట. సైజ్‌ జీరో కోసం 20 కేజీలు పెరిగిన అనుష్క ఇప్పుడు బరువు తగ్గే పనిలో పడింది. ఆల్రెడీ 7 కేజీలు తగ్గిన అనుష్క బ్యాలెన్స్‌ వెయిట్‌ కూడా తగ్గేందుకు వర్కవుట్‌ చేస్తోంది. 2015లో ప్రపంచ వ్యాప్తంగా హల్‌చల్‌ చేసిన బాహబలి చిత్రాన్ని మరచిపోక ముందే బాహుబలి 2 చిత్రం కూడా ఈ సంవత్సరంలోనే ప్రారంభమవుతోంది. 2016లో విడుదలయ్యే ఈ చిత్రం మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ