Advertisementt

డిస్కస్ చేయడానికి మోహన్ లాల్ వచ్చాడు!

Wed 25th Nov 2015 09:54 PM
mohan lal,korrapati sai,chandra sekhar yeleti,eega,aithe,sai korrapati with mohan lal  డిస్కస్ చేయడానికి మోహన్ లాల్ వచ్చాడు!
డిస్కస్ చేయడానికి మోహన్ లాల్ వచ్చాడు!
Advertisement
Ads by CJ

జాతీయస్థాయి ఉత్తమనటుడు మోహన్ లాల్, విలక్షణ నటి గౌతమి ప్రధానపాత్రల్లో తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఓ నూతన చిత్రం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం వంటి డిఫరెంట్ చిత్రాలను డైరెక్ట్ చేయడమే కాకుండా తొలి చిత్రం 'ఐతే’తో నేషనల్ అవార్డ్ దక్కించుకున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈగ, అందాల రాక్షసి,లెజండ్, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్యా వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించడంతో పాటు తొలి చిత్రం ‘ఈగ’తో నేషనల్ స్థాయి అవార్డు చేజిక్కించుకున్న స్టార్ ప్రొడ్యూసర్  వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. వచ్చేనెల నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమా గురించి డిస్కస్ చేయడానికి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వారాహి అధినేత, చిత్ర నిర్మాత సాయికొర్రపాటిని కలిశారు. వేర్వేరు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నలుగురు భిన్నమైన వ్యక్తుల కథే ఈ చిత్రం. మిగతా నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాత సాయికొర్రపాటి తెలియజేశారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ