Advertisementt

అడిగి మరీ ఫోటో తీయించుకున్న పవన్‌!

Mon 23rd Nov 2015 06:03 PM
pawan kalyan,sarath marar,kapil dev,pawan kalyan photo with kapil dev,kapil dev cricketer  అడిగి మరీ ఫోటో తీయించుకున్న పవన్‌!
అడిగి మరీ ఫోటో తీయించుకున్న పవన్‌!
Advertisement
Ads by CJ

పవన్‌కళ్యాణ్‌తో ఫోటో దిగాలని వేలాది మంది ఫ్యాన్స్‌ ఎదురుచూస్తుంటారు. అందుకోసం ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తారు. అయితే పవన్‌కు ఎవరితో ఫోటో దిగాలని ఉంటుందో తెలుసా? అది క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌తో అని చెప్పవచ్చు. ఆయనతో అడిగి మరి ఫొటోలు దిగాడు పవన్‌. పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' షూటింగ్‌ ప్రస్తుతం గుజరాత్‌లోని కుచ్‌రన్‌ అనే ఏరియాలో జరుగుతోంది. మరో నెలరోజుల పాటు అక్కడే షూటింగ్‌ జరుగుతుంది. దీంతో సినిమా కోసం ఈ చిత్ర యూనిట్‌ బస చేస్తున్న ఓ హోటల్‌లో పవన్‌, లెజెండరీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ అనుకోకుండా కలిశారు. ఈ విషయం తెలుసుకున్న కపిల్‌దేవ్‌ షూటింగ్‌ జరుగుతున్న లొకేషన్‌కు వెళ్లి పవన్‌ని కలుసుకున్నాడు. మీ సినిమాలు చూసి చాలా ఎంజాయ్‌ చేస్తాను.. అంటూ కపిల్‌ పవన్‌ను గ్రీట్‌చేశాడు. తన లొకేషన్‌లో కపిల్‌ను చూసి ఆనందపడిన పవన్‌ ప్రస్తుత సినిమాల గురించి తెలియజేస్తూ, క్రికెట్‌కు కపిల్‌ చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా పవన్‌.. కపిల్‌ను అడిగి ఆయనతో ఫోటో దిగాడు. కపిల్‌దేవ్‌ తమ టీమ్‌ను పలకరించడం, పవన్‌తో సరదాగా ముచ్చటించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ 'సర్దార్‌' టీమ్‌ పలు ఫొటోలను చిత్ర నిర్మాత శరత్‌మరార్‌ సోషల్‌ మీడియా ద్వారా వాటిని పోస్ట్‌ చేశాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ