Advertisementt

'సినీ మహల్‌' ఆడియో విశేషాలు!

Sun 22nd Nov 2015 06:54 PM
cinemahal audio release,siddhams,tejashwini,lakshman varma  'సినీ మహల్‌' ఆడియో విశేషాలు!
'సినీ మహల్‌' ఆడియో విశేషాలు!
Advertisement
Ads by CJ

సిద్దాంస్, రాహుల్, తేజస్విని హీరో హీరోయిన్లుగా లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో కళానిలయ క్రియేషన్స్ పతాకంపై బి.రమేష్ నిర్మిస్తున్న చిత్రం 'సినీ మహల్'. రోజులు నాలుగు ఆటలు అనేది ఉపశీర్షిక. శేఖర్‌ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని శనివారం హైదరాబాద్‌లోని పార్క్‌హయత్‌లో నిర్వహించారు. మారుతి థియేట్రికల్‌ ట్రైలర్‌, బిగ్‌ సీడీ, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. 

మారుతి మాట్లాడుతూ.. ''శేఖర్‌చంద్ర మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు.  ట్రైలర్‌ ప్రామిసింగ్‌గా ఉంది. పాటలు బావున్నాయి. అన్ని ఎలిమెంట్స్ కలగలిపిన సినిమా. యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌'' అని అన్నారు. 

దర్శకుడు లక్ష్మణ్‌వర్మ మాట్లాడుతూ.. ''నేను ఈరోజు దర్శకుడుగా ఇక్కడ నిలబడి ఉన్నానంటే కారణం పార్థుగారు, సినీ మహల్‌ రాజుగారు, కళానియ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌. మంచి మ్యూజిక్‌ కుదిరింది. నేను తీసిన రెండు గంటల సినిమాను సుద్ధాల అశోక్‌తేజ్‌ సింగిల్‌ లైన్‌లో చెప్పేశారు. సినిమాటోగ్రాఫర్‌ సినిమాను చక్కగా పిక్చరైజ్‌ చేశారు. ఆయన వల్లనే సినిమాను అనుకున్న టైంలో పూర్తి చేయగలిగాం. సపోర్ట్‌ చేసిన నటీనటులు, టెక్నిషియన్స్‌ అందరికీ థాంక్స్‌'' అని అన్నారు. 

నిర్మాతల్లో ఒకరైన పార్థు మాట్లాడుతూ.. ''సినిమా పరిశ్రమలో ఎవరు ఏ కష్టం పడ్డ ఆ ప్రతిఫలం సినిమా హాల్‌లో తెలిసిపోతుంది. కాబట్టి మా సినిమాకు 'సినీమహల్‌' అనే పేరు పెట్టే ముందు ఆలోచించాం. కానీ అవుట్‌పుట్‌ చూడగానే ధైర్యం వచ్చి ఈ టైటిల్‌ను పెట్టాం. టూరింగ్‌ టాకీస్‌కు సంబంధించిన సినిమా. హీరో తన ప్రాణాలను పణంగా పెట్టి టాకీస్‌న ఎలా దక్కించుకున్నాడనేదే కథ. డిఫరెంట్‌ లైన్‌తో తెరకెక్కించిన చిత్రం. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. త్వరలోనే రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అని అన్నారు. 

సంగీత దర్శకుడు శేఖర్‌ చంద్ర మాట్లాడుతూ.. ''దర్శకుడు లక్ష్మణ్‌వర్మతో జర్నీ చేయడం చాలా హ్యపీగా అనిపించింది. మంచి ఎనర్జిటిక్‌ పర్సన్‌. చాలా క్లారిటీతో సినిమాను డైరెక్ట్‌ చేశాడు. ఐదు మంది నిర్మాతలు కలిసి సినిమాను ఎక్కడా రాజీ కాకుండా నిర్మించారు. మ్యూజిక్‌కు తగిన విధంగా మంచి లిరిక్స్‌ కుదిరాయి'' అని అన్నారు. 

హీరో సిద్ధాంశ్‌ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, కళానిలయ క్రియేషన్స్‌ బ్యానర్‌కి థాంక్స్‌'' అని అన్నారు. 

రాహుల్‌ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో అర్జునుడిలాంటి పాత్రను చేశాను. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాని రూపొందించారు. ఇందులో మూడు షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌ చేశాను'' అని అన్నారు. 

సత్య, గొల్లపూడి మారుతీరావు, జీవా, జెమిని సురేష్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దొరై కె.సి.వెంకట్‌, సంగీతం: శేఖర్‌ చంద్ర, ఎడిటర్‌: ప్రవీణ్‌పూడి, కళ: గోవింద్‌, సాహిత్యం: సుద్దాల అశోక్‌ తేజ, చైతన్యకృష్ణ, హనుమాన్‌, నిర్మాత: బి.రమేష్‌, సహ నిర్మాతలు: పార్థు, బాలాజీ, మురళీధర్‌, కో-డైరెక్టర్‌: వాసు, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: లక్ష్మణ్‌ వర్మ. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ