Advertisementt

నారా రోహిత్ 'కథలో రాజకుమారి' ఎవరితో..?

Sat 21st Nov 2015 05:33 PM
kathalo rajakumari,kadhalo rajakumari,nara rothit,nara rohit kathalo rajakumari details,karthikeya,boggaram venkata srinivas,namitha promod  నారా రోహిత్ 'కథలో రాజకుమారి' ఎవరితో..?
నారా రోహిత్ 'కథలో రాజకుమారి' ఎవరితో..?
Advertisement
Ads by CJ

నారా రోహిత్ కొత్త చిత్రం 'కథలో రాజకుమారి'

వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ.. ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రామిసింగ్ హీరో నారా రోహిత్ నటించనున్న నూతన చిత్రం 'కథలో రాజకుమారి' త్వరలో ప్రారంభం కానుంది. కార్తికేయ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని నిర్మించిన మాగ్నస్ సినీప్రైమ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం తెలియజేస్తూ....కార్తికేయ లాంటి సూపర్ హిట్ తరువాత మళ్ళీ అంతకుమించిన సక్సెస్ ఫుల్ చిత్రం నిర్మించాలనే ఆలోచనతో ఓ నవ్యమైన కథతో ఈ చిత్రానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ చిత్రం ద్వారా మహేష్ సూరపనేని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హీరో క్యారెక్టరైజేషన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. నారా రోహిత్ సరసన నమితా ప్రమోద్ హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించడం మా అద్రుష్టంగా భావిస్తున్నాం. జనవరిలో షూటింగ్ ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం...అన్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: జయేష్ నాయర్, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఆర్ట్: సాహి సురేష్, సహా నిర్మాత: బీరం సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రవ సాయి సత్యనారాయణ, సమర్పణ: శిరువూరి రాజేష్ వర్మ, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మహేష్ సూరపనేని, నిర్మాత: వెంకట శ్రీనివాస్ బొగ్గరం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ