Advertisementt

'శ్రీమతి బంగారం' ప్లాటినం డిస్క్ వేడుక!

Sat 21st Nov 2015 02:46 PM
sreemathi bangaram movie platinum disc,vinay babu,rishi,vrushali  'శ్రీమతి బంగారం' ప్లాటినం డిస్క్ వేడుక!
'శ్రీమతి బంగారం' ప్లాటినం డిస్క్ వేడుక!
Advertisement

రిషి, రాజీవ్ కనకాల, ప్రియాంక, వృషాలి నటీనటులుగా శ్రీ మహేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై చెన్న శ్రీనివాస్, కొత్త సత్యనారాయణ రెడ్డి నిర్మించిన సినిమా 'శ్రీమతి బంగారం'. ఎం.వినయ్ బాబు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్లాటినం డిస్క్ ఫంక్షన్ శనివారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగింది. సాయి వెంకట్, ప్రతాని రామకృష్ణ గౌడ్ ప్లాటినం డిస్క్ లను చిత్రబృందానికి అందజేశారు. ఈ సందర్భంగా..

ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ''సినిమా టైటిల్ బావుంది. ఇటీవల విడుదలయిన ఈ చిత్రంలోని పాటలకు మంచి స్పందన వస్తోంది. నిర్మాత ఎక్కడ రాజీ పడకుండా చిత్రాన్ని తెరకెక్కించారు. ఛాంబర్ తరఫున థియేటర్ల విషయంలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం'' అని చెప్పారు.

సాయి వెంకట్ మాట్లాడుతూ.. ''సిద్ధ బాపు సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదలై శ్రోతలను అలరిస్తోంది. పాటలు బావుండడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పాటలను హిట్ చేసినట్లుగానే సినిమాను కూడా హిట్ చేస్తారని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

రిషి మాట్లాడుతూ.. ''ఇదొక మంచి కుటుంబ కథా చిత్రం. సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ తో సహా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. చాలా కాలం తరువాత తెలుగులో నా సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిశంబర్ నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.

వృషాలి మాట్లాడుతూ.. ''సిద్ధ బాబు గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్ఛిన దర్శక నిర్మాతలకు థాంక్స్'' అని చెప్పారు.

శోభారాణి మాట్లాడుతూ.. ''మంచి టైటిల్. సాంగ్స్, ట్రైలర్ చాలా బావున్నాయి. రిషి, రాజీవ్ కనకాల కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కాబట్టి ఖచ్చితంగా సినిమా హిట్ అని తెలుస్తోంది. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో హేమ, ఘటికాచలం, సహదేవ్, వినయ్ బాబు, చెన్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

వేణుమాధవ్, హేమ, శ్రీకాంత్ రెడ్డి, తీన్ మార్ మల్లన్న తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు : ఘటికాచలం, ఎడిటింగ్ : నందమూరి హరి, కెమెరా : సహదేవ్, కోరియోగ్రఫీ : వేణుపాల్, రామ్, ఫైట్ మాస్టర్ : సూపర్ ఆనంద్, నిర్వహణ : జివి సత్యనారాయణ, నిర్మాతలు : చెన్న శ్రీనివాస్, కొత్త సత్యనారాయణ రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఎం.వినయ్ బాబు.   

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement