Advertisementt

‘'శౌర్య' మూవీ ఫస్ట్‌ లుక్‌ లాంచ్!

Fri 20th Nov 2015 01:56 PM
shourya movie first look launch,manoj,dasarath,malkapuram sivakumar  ‘'శౌర్య' మూవీ ఫస్ట్‌ లుక్‌ లాంచ్!
‘'శౌర్య' మూవీ ఫస్ట్‌ లుక్‌ లాంచ్!
Advertisement
Ads by CJ

మంచు మనోజ్‌, రెజీనా జంటగా బేబి త్రిష సమర్పణలో సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి.బ్యానర్‌పై  దశరథ్‌ దర్శకత్వంలో శివకుమార్‌ మల్కాపురం నిర్మిస్తున్న చిత్రం 'శౌర్య’'.ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ ను పార్లమెంట్ సభ్యుడు వి.బి.పాటిల్ గురువారం హైదరాబాద్‌లో విడుదల చేసారు. ఈ సందర్భంగా..

పార్లమెంట్ సభ్యుడు వి.బి.పాటిల్‌ మాట్లాడుతూ.. ''సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. టీం అందరికి ఆల్‌ ది బెస్ట్‌'' అని చెప్పారు.

దశరథ్‌ మాట్లాడుతూ.. ''ఇదొక థ్రిల్లర్ లవ్ స్టొరీ. ఇప్పటివరకు డెబ్బై ఐదు శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. డిశంబర్ 6 కు చివరి షెడ్యూల్ పూర్తి చేస్తాం. డిసెంబర్‌ 31 నాటికి సినిమా ఫస్ట్‌కాపీ రెడీ అవుతుంది'' అని అన్నారు. 

హీరో మనోజ్‌ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పాత్రలో కనిపిస్తాను. లవ్ అండ్ థ్రిల్లర్ సబ్జెక్టు ఇది. నేను ఇప్పటివరకు అన్నీ మాస్‌ సినిమాలే చేశాను. దశరథ్‌ గారికి మంచి క్లాస్ ఇమేజ్ ఉంది. మా కాంబినేషన్ వస్తున్న ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మంచి మ్యూజిక్‌ కుదిరింది. నిర్మాత శివకుమార్‌గారు చాలా రిచ్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు'' అని అన్నారు. 

నిర్మాత మల్కాపురం శివకుమార్‌ మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌లో వస్తోన్న రెండో సినిమా ఇది. ఆర్టిస్ట్స్‌, టెక్నిషియన్స్‌ బాగా సపోర్ట్‌ చేస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను నిర్మిస్తున్నాం. మంచి కథ. జనవరిలో సినిమాను విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం'' అని అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో రెజీనా, నాగినీడు, సుధ, రూప, చంద్రకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

ప్రకాష్‌ రాజ్‌, బ్రహ్మానందం, షాయాజీషిండే, సుబ్బరాజు, నాగినీడు, శ్రవణ్‌, బెనర్జీ, జి.వి., ప్రభాస్‌ శ్రీను, షకలక శంకర్‌, సత్యప్రకాష్‌, సూర్య, శివారెడ్డి, సుధ, మధుమణి, హేమ, సంధ్యాజనక్‌, చంద్రకాంత్‌, రూప ఇతర తారాగణం. ఈ చిత్రానికి స్టంట్స్‌: వెంకట్‌, కొరియోగ్రఫీ: భాను, ఆర్ట్‌: హరిబాబు, రచనా సహకారం: హరికృష్ణ, సాయికృష్ణ, స్క్రీన్‌ప్లే: గోపు కిషోర్‌, రచన: గోపి మోహన్‌, ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: వేదా.కె, సినిమాటోగ్రఫీ: మల్హర్ భట్‌ జోషి, నిర్మాత: శివకుమార్‌ మల్కాపురం, దర్శకత్వం: దశరథ్‌.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ