Advertisementt

చిరు అన్నయ్య కూడా చూస్తున్నాడు!

Thu 19th Nov 2015 06:12 PM
naga babu,seethamalakshmi serial,maa tv,chiranjeevi  చిరు అన్నయ్య కూడా చూస్తున్నాడు!
చిరు అన్నయ్య కూడా చూస్తున్నాడు!
Advertisement
Ads by CJ

మెగా బ్రదర్ నాగబాబు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వెండి తెర మీద సరిగ్గా వెలగకపోయినా బుల్లి తెర మీద మాత్రం దేదీప్యమానంగా చంకాయిస్తున్నాడు. ఈయన కథ, కథనంతో పాటు హీరోగా మొదలైన సీతామాలక్ష్మి అనే టీవీ ధారావాహికం ఒకటి మా టీవీలో సూపర్ డూపర్ హిట్టయి కూర్చుంది. ఈ సీరియల్ ప్రారంభం నుండి కథాబలంతో పాటుగా నాగబాబు ఫేస్ వ్యాల్యూ మీదే నడుస్తోంది. బిగ్ స్క్రీన్ మీద మిస్సయిన నాగబాబు ట్యాలెంటుకు ఇక్కడ మంచి గిరాకీయే  దొరికింది అంటున్నారు మహిళా ప్రేక్షకులు. భరణి, ప్రవలికలు ముఖ్య పాత్రల్లో నటించినా నాగబాబు క్యారెక్టర్ సూపరుగా జనాలకు కనెక్ట్ అయింది. ఇది ఎంతలా అంటే, అన్నయ్య చిరంజీవి కూడా సీతామాలక్ష్మి సీరియల్ ఫ్యాన్ అయిపోయి... దాని కన్నా ముందు వచ్చే సీరియల్ అటు తరువాత వచ్చే సీరియల్ కూడా చూసేస్తున్నాడు అని నాగబాబు తెగ ఆనందంగా చెప్పుకుంటున్నాడు. ఇటు సీతామాలక్ష్మి, అటు జబర్దస్త్, ఎకస్ట్రా జబర్దస్త్... నాగబాబు ఫుల్ బిజీ అయిపోయారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ