నాగశౌర్య, పలక్ లల్వాని జంటగా జేజి సినిమాస్, కిరణ్ స్టూడియోస్, బ్లూమింగ్ స్టార్స్ మోషన్ పిక్చర్స్, మోహన్ రూపా ఫిలింస్ సంస్థలు నిర్మించిన చిత్రం 'అబ్బాయితో అమ్మాయి'. రమేశ్ వర్మ దర్శకత్వంలో వందన అలేఖ్య జక్కం, శ్రీనివాస్ సమ్మెట, కిరీటి పోతిని నిర్మించిన ఈ చిత్రానికి ఇళయరాజా పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం పాటల విడుదల కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్ లో నిర్వహించారు. మ్యూజిక్ మేస్ర్టో ఇళయరాజా బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..
ఇళయరాజా మాట్లాడుతూ.. ''అందరూ ప్రేమికులే. నాకు సంగీతమంటే ప్రేమ, కొంతమందికి డబ్బంటే ప్రేమ. ప్రేమ లేకపోతే జీవితం లేదు. అలాంటి ప్రేమను మెయిన్ థీమ్ గా పెట్టుకొని రమేశ్ వర్మ 'అబ్బాయితో అమ్మాయి' అనే సినిమాను రూపొందించాడు. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.
రమేశ్ వర్మ మాట్లాడుతూ.. ''ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుంది. నాగశౌర్య, పలక్ చక్కగా నటించారు. ఇళయరాజా గారు స్క్రిప్ట్ నచ్చడంతో ఈ సినిమాకు మ్యూజిక్ చేయడానికి అంగీకరించారు. అధ్బుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. '' ట్రైలర్ కు, పోస్టర్స్ కు మన్చి రెస్పాన్స్ వస్తోంది. క్రిస్మస్ కానుకగా డిశంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.
నాగశౌర్య మాట్లాడుతూ.. ''ఇళయరాజా గారి గురించి మాట్లాడే వయసు నాకు లేదు. వెయ్యి సినిమాలకు దగ్గరవుతున్నారు. నా కెరీర్ మొదట్లోనే ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. రమేశ్ వర్మను అన్న అని పిలుస్తుంటాను. నా మొదటి సినిమా రిలీజ్ అవ్వకముందు నుండే రమేశ్ అన్న నాకు తెలుసు. మూడు సంవత్సరాల క్రితమే ఈ సినిమా చేయాల్సింది. కాని కుదరలేదు. ఇప్పటికి కుదిరింది. శ్యాం గారు నన్ను చాలా అందంగా చూపించారు. టెక్నీషియన్స్ అంతా కష్టపడి పని చేశారు. సినిమా మంచి సక్సెస్ కావాలి'' అని చెప్పారు.
పలక్ లల్వాని మాట్లాడుతూ.. ''నా మీద నమ్మకంతో ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్. ఈ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నాను'' అని చెప్పారు.
దాసరి కిరణ్ మాట్లాడుతూ.. ''రమేశ్ వర్మ గారు నాకు మంచి ఆప్తులు. 30 రోజుల క్రితం నేను ఈ సినిమా చూసాను. మంచి కమర్షియల్ ఎంటర్టైనింగ్ మూవీ. ఇలాంటి సినిమా మంచి విజయం సాధించి, ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''నాగశౌర్య, ఇళయరాజా గారు మ్యూజిక్ అందించిన సినిమాలో నటించడం గర్వంగా ఉంది. తనకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. టీం అందరికి నా శుభాకాంక్షలు'' అని చెప్పారు.
నందిని రెడ్డి మాట్లాడుతూ.. ''ప్రతి డిజైన్, ప్రతి పోస్టర్, ప్రతి ఫ్రేమ్ అధ్బుతంగా ఉంది. రమేశ్ వరం కథను నమ్మి నిర్మాతలు చాలా రిచ్ గా సినిమా తీశారు. నాగశౌర్య మంచి టాలెంట్ ఉన్న నటుడు. ఇళయరాజా గారిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది'' అని చెప్పారు.
బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. ''మంచి టెక్నీషియన్స్ ను పెట్టుకొని రమేశ్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఫోటోగ్రఫీ చాలా బావుంది. ఇళయరాజా గారి మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమేశ్ కు ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
రెహ్మాన్ మాట్లాడుతూ.. ''ఇళయరాజా గారి మ్యూజిక్ లో ఒక పాట రాసిన చాలనుకున్నాను కాని సినిమాలో మొత్తం ఆరు పాటలు రాయడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది'' అని చెప్పారు.
రావు రమేశ్ మాట్లాడుతూ.. ''రమేశ్ చెప్పిన కథ నచ్చి నిర్మాతలు ఎంతో ప్యాషనేట్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎగ్జైట్ అయ్యే ఫాదర్ రోల్ లో కనిపిస్తాను. నేను చెప్పిన డైలాగ్స్ కు ఇళయరాజా గారు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడం థ్రిల్లింగ్ గా అనిపించింది'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్.పి.పట్నాయక్, సునీత, లగడపాటి శ్రీధర్, సి.కళ్యాణ్, గౌతమ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ఎం.ఎం.శ్రీలేఖ, సాయి కొర్రపాటి, మల్టీ డైమెన్షన్ వాసు, డి.ఎస్.రావు, సాయి కొర్రపాటి, సురేష్ కొండేటి, రఘు, జెమినీ కిరణ్, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: శ్యాం కె నాయుడు, మ్యూజిక్: ఇళయరాజా, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, లిరిక్స్: రెహ్మాన్, యాక్షన్: వెంకట్ శ్రీను, నిర్మాతలు: వందన అలేఖ్య జక్కం, కిరీటి, శ్రీనివాస్, దర్శకత్వం: రమేష్ వర్మ.