Advertisementt

'సావిత్రి' స్టేటస్ ఇదే!

Tue 17th Nov 2015 06:22 PM
savithri movie,nara rohit,nanditha,pawan sadhineni  'సావిత్రి' స్టేటస్ ఇదే!
'సావిత్రి' స్టేటస్ ఇదే!
Advertisement
Ads by CJ

యంగ్ జనరేషన్ హీరో లలో మంచి పేరు సంపాదించుకుంటున్న నారా రోహిత్ హీరో గా , నందిత హీరోయిన్ గా రూపొందుతోన్న చిత్రం 'సావిత్రి'. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని దర్శకత్వం లో, విజన్ ఫిలింమేకర్స్ పతాకం పై డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నారు. 

మొదటి షెడ్యుల్ ను విజయవంతం గా పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. ''ఇది ఒక పూర్తి ఫామిలీ ఎంటర్టైనర్. మొదటి షెడ్యూల్ ని విజయవంతం గా పూర్తి చేసి, ఇప్పుడు రెండవ షెడ్యూల్ ని ఏలూరు పరిసర ప్రాంతాలలో నవంబరు 18 నుండి ప్రారంభిస్తున్నాం. రోహిత్, నందిత ల కాంబినేషన్ ఈ చిత్రానికి ఎంతో ప్లస్ అవుతుంది. ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం'' అని  నిర్మాత డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 

దర్శకుడు పవన్ సాదినేని మాట్లాడుతూ.. ''ప్రేమా ఇష్క్ కాదల్ చిత్రం తో మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు నారా రోహిత్ తో 'సావిత్రి' చిత్రాన్ని ఒక పూర్తి కమర్షియల్ ఫామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నాం. రోహిత్ పెర్ఫార్మన్స్ లో, బాడీ లాంగ్వేజ్ లో ఎంతో ఫ్రెష్నెస్ ఈ చిత్రం లో ఉంటుంది. నందిత వంటి అభినయం తెలిసిన హీరోయిన్ తో పని చేయటం ఆనందం గా ఉంది'' అని అన్నారు. 

ఈ చిత్రం 2016 ప్రధమార్ధం లో విడుదల అవుతుంది. 

నటీనటులు : 

నారా రోహిత్, నందిత, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, అజయ్, రవి బాబు, జీవ, వెన్నెల కిషోర్, శ్రీముఖి , ధన్య బాలకృష్ణన్, మధు నందన్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను షకలక శంకర్ తదితరులు 

సాంకేతిక విభాగం :

సినిమాటోగ్రఫీ - వస్సంత్ , డైలాగ్స్ - కృష్ణ చైతన్య, సంగీతం - శ్రవణ్ , ఎడిటర్ - గౌతం నెరుసు , ఫైట్స్ - డ్రాగన్ ప్రకాష్, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం - పవన్ సాదినేని, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ - జాబిల్లి నాగేశ్వర రావు, నిర్మాత - డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ