Advertisementt

'తను నేను' రిలీజ్ డేట్ ఖరారు!

Tue 17th Nov 2015 12:14 PM
thanu nenu release date,santhosh,avika gor,rammohan  'తను నేను' రిలీజ్ డేట్ ఖరారు!
'తను నేను' రిలీజ్ డేట్ ఖరారు!
Advertisement
Ads by CJ

సంతోష్ శోభన్, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో సన్‌షైన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్మోహన్‌ దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం 'తను నేను'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 27న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా..

డి.సురేష్ బాబు మాట్లాడుతూ.. ''హీరో నాని ని 'అష్టా చమ్మా' తో, రాజ్ తరుణ్ ని 'ఉయ్యాల జంపాలా' చిత్రాలతో ప్రొడ్యూసర్ రామ్మోహన్ హీరోలుగా పరిచయం చేశాడు. మొదటిసారిగా ఆయన దర్శకునిగా మారి సంతోష్ హీరోగా 'తను నేను' చిత్రాన్ని తెరకెక్కించాడు. సంతోష్ తండ్రి నాకు మంచి స్నేహితుడు. సంతోష్ లో మంచి టాలెంట్ ఉంది. 'గోల్కొండ హై స్కూల్' సినిమాలో నటించాడు. ఇదొక క్లీన్ మూవీ. యూత్, ఫ్యామిలీస్  చూడదగ్గ చిత్రం. ఈ నెల 27న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సుమారుగా 130 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం'' అని చెప్పారు.

దర్శకనిర్మాత మాట్లాడుతూ.. ''అష్టా చమ్మా' సినిమా దగ్గర నుండి నాయుడు గారు, సురేష్ బాబుల వద్ద పని చేస్తూ వచ్చాను. వారి బ్యానర్ లో ఓ సినిమా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. మూడు సంవత్సరాల క్రితం రామానాయుడు ఫిలిం స్కూల్ లో చదివే ఓ స్టూడెంట్ నా దగ్గరకి వచ్చి ఓ స్క్రిప్ట్ ఇచ్చాడు. కొన్ని కారణాల వలన తను ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేయకుండా స్క్రిప్ట్ నా వద్ద వొదిలేసి వెళ్ళిపోయాడు. కథ బాగా నచ్చడంతో సినిమా చేయడానికి సిద్ధపడ్డాను. ఇదొక రొమాంటిక్, కామెడీ మూవీ. సినిమాలో గొప్ప లవ్ స్టొరీ ఉంటుంది. సంతోష్ నటనలో శిక్షణ తీసుకున్నాడు. అవికా చాలా ఎఫర్ట్ పెట్టి నటించింది'' అని చెప్పారు.

నాని మాట్లాడుతూ.. ''అష్టా చమ్మా నుండి రామ్మోహన్ గారితో మంచి పరిచయం ఉంది. ప్రొడ్యూసర్ గా మంచి పొజిషన్ లో ఉన్న ఆయన డైరెక్టర్ గా సినిమా చేసారని తెలియగానే మొదట భయపడ్డాను. కాని సినిమా మొదటి కాపీ చూసిన తరువాత మంచి నిర్ణయం తీసుకున్నారనిపించింది. సింపుల్, స్వీట్ లవ్ స్టొరీ ఇది. 'అష్టా చమ్మా' లో నేను చేసిన పెర్ఫార్మన్స్ కు వంద రెట్లు ఎక్కువగా సంతోష్ ఈ సినిమాలో నటించాడు. ప్రేక్షకులు సరదాగా, నవ్వుకుంటూ.. చూసే సినిమా. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ''రామ్మోహన్ గారు నా గాడ్ ఫాదర్. ఈ సినిమా బాగా వచ్చింది. మంచి స్క్రిప్ట్. ఖచ్చితంగా సినిమా మంచి విజయం సాధిస్తుంది'' అని చెప్పారు.

సంతోష్ మాట్లాడుతూ.. ''నేను హీరో కావాలనేది నా కల, మా నాన్నగారి కల. మా కళను నిజం చేసిన సురేష్ బాబు గారికి, రామ్మోహన్ గారికి రుణ పడి ఉంటాను'' అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ