Advertisementt

'శ్రీమంతుడు' సైకిల్‌ విజేత ఇతనే!

Tue 17th Nov 2015 10:10 AM
sreemanthudu,cycle prize,mahesh babu,nagendar reddy  'శ్రీమంతుడు' సైకిల్‌ విజేత ఇతనే!
'శ్రీమంతుడు' సైకిల్‌ విజేత ఇతనే!
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌ (సివిఎం) సూపర్‌ డూపర్‌ హిట్‌ మూవీ 'శ్రీమంతుడు'. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్‌ అయిన ఈ చిత్రం రికార్డు కలెక్షన్లతో బిగ్గెస్ట్‌ గ్రాసర్‌గా ఈ చిత్రం నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రం నవంబర్‌ 14కి 15 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. గత కొంతకాలంగా ఈ చిత్రంలో ఉపయోగించిన సైకిల్‌కి సంబంధించిన కాంటెస్ట్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సైకిల్‌ విజేతను ఈరోజు డ్రా ద్వారా సూపర్‌స్టార్‌ మహేష్‌ ఎంపిక చేశారు. 

ఈ సందర్భంగా నిర్మాతలు నవీన్‌, రవి, సివిఎం మాట్లాడుతూ.. ''మా శ్రీమంతుడు చిత్రంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ ఉపయోగించిన సైకిల్‌కి సంబంధించి గత కొంతకాలంగా ఒక కాంటెస్ట్‌ రన్‌ అవుతోంది. ఈ కాంటెస్ట్‌కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. వేలాదిగా ఈ కాంటెస్ట్‌లో పాల్గొన్నారు. ఈ కాంటెస్ట్‌లో సైకిల్‌ విజేతను సూపర్‌స్టార్‌ మహేష్‌ ఈరోజు డ్రా ద్వారా ఎంపిక చేశారు. కరీంనగర్‌కు చెందిన జి.నాగేందర్‌రెడ్డి ఈ సైకిల్‌ను గెలుచుకున్నారు. విజేత జి.నాగేందర్‌రెడ్డికి మహేష్‌ చేతులమీదుగా సైకిల్‌ను అందజేయడం జరుగుతుంది'' అన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ