Advertisementt

ఐతే 2.0 సినిమా ప్రారంభం!

Mon 16th Nov 2015 04:03 PM
ithe 2.0 movie opening,raj madiraju,vijayaramaraju  ఐతే 2.0 సినిమా ప్రారంభం!
ఐతే 2.0 సినిమా ప్రారంభం!
Advertisement
Ads by CJ

ఇంద్రనీల్ సేన్ గుప్తా, జారాషా, అభిషేక్, మృదాంజలి, కర్తవ్య, నీరజ్ ప్రధాన పాత్రల్లో రాజ్ మదిరాజు దర్శకత్వంలో కె.విజయరామరాజు, డా|| హేమంత్ వల్లపురెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఐతే 2.0'. ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుక సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి రమేష్ ప్రసాద్ క్లాప్ కొట్టగా.. జూపూడి ప్రభాకర్ రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తెలంగాణా ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు రామ్మోహన్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..

టిడిపి ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. ''ఈ చిత్ర నిర్మాత విజయరామరాజు మార్కెటింగ్ రంగంలో రాణిస్తున్నారు. మార్కెటింగ్ వ్యాపారంలో ఆయనకున్న మెళకువలు మరెవరి వద్ద ఉండవు. మొదటిసారిగా ఆయన సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారు. యువత ఏ విధంగా పెడదారి పడుతున్నారో అనే అంశాన్ని ప్రధానంగా తీసుకొని చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యూత్ ను సరైన దారిలో పెట్టడానికి చేస్తున్న ప్రయత్నమిది. సమాజానికి ఉపయోగపడే ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

బసిరెడ్డి మాట్లాడుతూ.. ''సాహసమైన ప్రయత్నం చేస్తున్న ఈ చిత్ర బృందాన్ని అందరూ సపోర్ట్ చేయాలి. హైదరాబాద్ నుండి మంచి సినిమాలు రావాలి. రాజ్ మదిరాజు గారు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

దర్శకుడు రాజ్ మదిరాజు మాట్లాడుతూ.. ''12 సంవత్సరాల క్రితం వచ్చిన ఐతే చిత్రం అందరిని బాగా ఇన్స్పైర్ చేసింది. సైలెంట్ గా సింపుల్ గా థ్రిల్లర్ సినిమా ఎలా చేయాలో.. చూపించారు. అయితే ఈ సినిమా మాత్రం శబ్దవంతంగా ఉంటుంది. ఇంటర్నెట్ మరియు టెక్నాలజీల వల్ల కలిగే నష్టాల మరియు మోసలా చుట్టూ తిరిగే ఓ టెక్నికల్ థ్రిల్లర్ కాన్సెప్టే ఈ సినిమా. ఇంటర్నెట్ వల్ల ఎంత ఎంజాయ్ చేయొచ్చో.. అంతే హానీ కూడా ఉంటుందనే అంశాలను ఈ సినిమాలో చూపించాం. సినిమా షూటింగ్ ఈరోజు నుండి కంటిన్యూస్ గా నిర్వహించి 45 డేస్ లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ నిర్వహిస్తాం'' అని చెప్పారు.

నిర్మాత విజయరామరాజు మాట్లాడుతూ.. ''మా ప్రొడక్షన్ లో వస్తున్న మొదటి సినిమా. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

ఇంద్రనీల్ సేన్ గుప్తా మాట్లాడుతూ.. ''తెలుగులో ఇది నా మొదటి సినిమా. ఈ సినిమాలో అవకాసం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్'' అని చెప్పారు.

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: కౌశిక్ అభిమన్యు, సంగీతం: అరుణ్ చిలువేరు, కూర్పు: శశాంక్ మాలి, మాటలు, పాటలు: కిట్టు విస్సా ప్రగడ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కల్యాణం మురళి, నిర్మాతలు: కె.విజయరామరాజు, డా|| హేమంత్ వల్లపురెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాజ్ మదిరాజు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ