ప్రస్థానం వంటి డిఫరెంట్ మూవీతో సినిమా రంగానికి పరిచయమైన యంగ్ హీరో సందీప్‌కిషన్. రొటీన్ లవ్‌స్టోరి, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, బీరువా, టైగర్ వంటి విలక్షణమైన చిత్రాలతో మంచి సక్సెస్‌లు సాధించారు. ఇప్పుడు మరో డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌తో నడిచే కమర్షియల్ ఎంటర్ టైనర్ ఒక్క అమ్మాయి తప్ప చిత్రంలో నటిస్తున్నారు.
అక్టోబర్ లో పూజా కార్యక్రమం జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ నవంబర్ 18 నుండి ప్రారంభం అవుతుంది. ఈ చిత్రం లో విలక్షణమైన నటి నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. సందీప్ కిషన్, నిత్యా మీనన్ ల కాంబినేషన్ ఈ చిత్రానికి ఒక స్పెషల్ హైలైట్ అవుతుంది అని నిర్మాత బోగాధి అంజిరెడ్డి అన్నారు.
నూతన దర్శకుడు రాజసింహ తాడినాడ ఈ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.
హీరో సందీప్‌కిషన్ మాట్లాడుతూ ఈ సినిమాలో నేనొక తెలివైన కాలేజ్ కుర్రాడి పాత్ర పోషిస్తున్నాను. ఈ చిత్రం లో హీరోయిన్ గా నిత్యా మీనన్ నటిస్తోంది. మా కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రం ఒక మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది అన్నారు.
దర్శకుడు రాజసింహ తాడినాడ మాట్లాడుతూ దర్శకుడిగా నా తొలి చిత్రం ఇది. ఈ సినిమాని మూడేళ్ళ క్రితమే సందీప్‌కి చెప్పాను. సినిమాలో నలభై ఐదు నిమిషాల పాటు గ్రాఫిక్స్ ఉంటుంది. ఈ సినిమా కోసం ఫ్లై ఓవర్ సెట్ కూడా వేస్తున్నాం. ఈ నెల 18 నుండి రెగ్యలర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. కొత్త బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. సందీప్ కొత్తగా కనిపిస్తాడు అన్నారు.
నటీ నటులు - సందీప్ కిషన్, నిత్యా మీనన్, బ్రహ్మానందం, రవికిషన్, అలీ, తనికెళ్ళభరణి, రావు రమేష్, పృథ్వీ, సప్తగిరి తదితరులు.
సినిమాటోగ్రాఫర్: ఛోటా కె.నాయుడు, ఆర్ట్: చిన్నా, మ్యూజిక్: మిక్కి జె.మేయర్, ఎడిటింగ్: గౌతంరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆళ్ళ రాంబాబు, నిర్మాత: బోగాధి అంజిరెడ్డి, కథ, మాటు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజసింహ తాడినాడ.