ఆది, ఆదాశర్మ జంటగా శ్రీమతి వసంత శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్క్రీన్స్ పతాకంపై మదన్ దర్శకత్వంలో పి.సురేఖ నిర్మిస్తున్న చిత్రం 'గరం'. ఈ చిత్రం లోగోను, మోషన్ పోస్టర్ ను శనివారం హైదరాబాద్ లో లాంచ్ చేసారు. ఈ సందర్భంగా..
సాయి కుమార్ మాట్లాడుతూ.. ''నా తండ్రి, నేను, తమ్ముడు అందరం బాలనటులుగానే ఇండస్ట్రీకి పరిచయమయ్యాం. ఆది కూడా తన చిన్నప్పుడు ఓ నాటకంలో నటించాడు. ఆది నటిస్తున్న ఏడవ చిత్రమిది. మా ప్రొడక్షన్ లో వస్తున్న మొదటి చిత్రం. మదన్ ఎంతో ప్యాషనేట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరూ ఎఫర్ట్ పెట్టి పని చేసారు. అగస్త్య మంచి మ్యూజిక్ ఇచ్చాడు. త్వరలోనే పాటలను విడుదల చేయనున్నాం'' అని చెప్పారు.
అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ''ఆది హీరో కాకముందే నాకు తెలుసు. ఆదిను ఇండస్ట్రీకు 'ప్రేమ కావాలి' సినిమా ద్వారా పరించయం చేసాం. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఓ నటునికి కావాల్సిన అన్ని లక్షణాలు ఆదిలో ఉన్నాయి. నిబద్దత, క్రమశిక్షణతో పని చేస్తాడు. ఎక్కువ చిత్రాల్లో నటించడం కంటే క్వాలిటీ తో ఉండే చిత్రాల్లోనే నటించాలని సెలెక్టెడ్ స్క్రిప్ట్స్ లోనే నటిస్తున్నాడు. మంచి కమర్షియల్ వాల్యూస్ తో కూడిన చిత్రానికి ఎంటర్టైన్మెంట్ జోడించి తీసారు. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది''అని చెప్పారు.
దర్శకుడు మదన్ మాట్లాడుతూ.. ''శ్రీనివాస్ చెప్పిన కథ విని సినిమా చేయాలని భావించాను. కథలో కొత్తదనం ఉంటుంది. ద్వేషించే వాళ్ళను ప్రేమించే స్థాయికి ఎదగడం చాలా కష్టం. ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించాను. ఆది సంకల్పబలమే ఈ సినిమా. తను ఎంతగానో సపోర్ట్ చేసాడు. క్యారెక్టర్ ను ప్రేమించి చేసాడు. ఇది బెస్ట్ ఫిలిం అవుతుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.
ఆది మాట్లాడుతూ.. ''ఈ సినిమా కథ విని సొంతంగా చేద్దామని నాన్నకు చెప్పాను. ఆయన కూడా కథ విన్నాక ఓకే చెప్పారు. ప్రొడ్యూసర్ కావడం చిన్న విషయం కాదు. ప్రొడ్యూసర్స్ లేకపోతే ఫిలిం ఇండస్ట్రీనే లేదు. నేను నిర్మాతల హీరోను. మదన్ సెన్సిబుల్ డైరెక్టర్. సినిమాలో ఉండే ఎమోషన్ అందరికి రీచ్ అవుతుంది'' అని చెప్పారు.
శ్రీనివాస్ గవిరెడ్డి మాట్లాడుతూ.. ''అసిస్టెంట్ డైరెక్టర్ గా తిరుగుతున్నప్పుడు నేను రెడీ చేసిన కథ విని నన్ను నమ్మి సినిమా చేసారు. ఇందులో ఆది క్యారెక్టర్ డిఫరెంట్ గా, న్యాచురల్ గా ఉంటుంది. మంచి ఎంటర్టైనింగ్ ఫిలిం'' అని చెప్పారు.
సంగీత దర్శకుడు అగస్త్య మాట్లాడుతూ.. '' ఆది లో సూపర్ ఎనర్జీ ఉంటుంది. కామెడీ కంటెంట్ ఉన్న సినిమా. బాగా వచ్చింది'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఆదాశర్మ, సురేఖ, రఘుబాబు, బాబ్జి, సురేందర్ రెడ్డి, కార్తిక శ్రీనివాస్, వసంత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి కథ,మాటలు-శ్రీనివాస్ గవిరెడ్డి, పాటలు: భాస్కర్ భట్ల, చైతన్య ప్రసాద్, శ్రీమణి, పులగం చిన్నారాయణ, కోరియోగ్రఫీ: శేఖర్, జాని, విద్యాసాగర్, ఫైట్స్: థ్రిల్లర్ మంజు, వెంకట్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: టి.సురేందర్ రెడ్డి, సంగీతం: అగస్త్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబ్జి, నిర్మాత: పి.సురేఖ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మదన్.