బి.ఆర్.ఎస్.ఐ మూవీస్ బ్యానర్ పై గోపీనాథ్ హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహించిన చిత్రం ''21st సెంచరి లవ్''. నరేందర్.పి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విష్ణు ప్రియ, గోపీనాథ్ సరసన నటిస్తోంది. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ప్రతాని రామకృష్ణ గౌడ్ బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..
దర్శకుడు గోపీనాథ్ మాట్లాడుతూ.. ''పర్సనాలిటీ డెవలప్ మెంట్ ట్రైనర్ గా సుమారుగా యాబై వేల మంది విద్యార్దులకు శిక్షణ ఇచ్చాను. అసలు మనిషి మానసికంగా ఎందుకు క్రుంగిపోతున్నాడు..? చనిపోయే స్థాయికి ఎందుకు వెళ్తున్నాడనే విషయాల గురించి రీసెర్చ్ చేసాను. నా అనుభవాల ద్వారా ఈ సినిమా కథను సిద్ధం చేశాను. ప్రతి రోజు వార్తల్లో ప్రేమ విఫలమై చనిపోతున్నవారి గురించి, తన ప్రేమను అంగీకరించలేదని యాసిడ్ దాడులు చేయడం ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం. ఈ సినిమా స్నేహానికి, ప్రేమకు, ఆకర్షణకు నిజమైన నిర్వచనం చెప్పే కథ. ప్రేమపై పి.హెచ్.డి చేసే జంట కథే ఈ చిత్రం. ఇందులో ఒరిజినల్ లవ్ స్టొరీను చూపించాం. ప్రొడ్యూసర్ గారు నాపై ఉన్న నమ్మకంతో సినిమా చేశారు'' అని చెప్పారు.
సంగీత దర్శకుడు కనిష్క మాట్లాడుతూ.. ''స్క్రిప్ట్ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. సినిమాలో పరిస్థితులకు తగ్గట్లుగా ఆరు పాటలుంటాయి. ఆడియో, సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
నిర్మాత నరేందర్ మాట్లాడుతూ.. ''గోపి లో మంచి కసి ఉంది. ప్రస్తుతం ఉన్న జనరేషన్ కు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుంది. యూత్ కు మంచి మెసేజ్ ఉంటుంది. సినిమా బాగా వచ్చింది. ప్రివ్యూ చూసిన వారంతా బావుందని చెబుతున్నారు. సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం'' అని చెప్పారు.
ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ''ట్రైలర్ లో గోపీనాథ్ ను చూస్తుంటే కొత్త హీరోగా అనిపించలేదు. డాన్సులు చాలా బాగా చేసాడు. ఈ సంవత్సరంలో రిలీజ్ అయిన అన్ని చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఈ సినిమా కూడా అదే కోవలోకి రావాలని ఆశిస్తున్నాను. థియేటర్ విషయంలో ఎలాంటి సహాయం చేయడానికైనా.. సిద్ధంగా ఉంటాను'' అని చెప్పారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ''గోపీనాథ్ తో కొన్ని రోజులుగా మంచి పరిచయం ఏర్పడింది. తను చాలా కష్టపడి ఈ సినిమా చేసాడు. విష్ణు ప్రియ, గోపి ల జంట బావుంది. టీం అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఖచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుంది'' అని చెప్పారు.
బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ''కొత్త వాళ్ళంతా కలిసి ఇన్నోవేటివ్ సబ్జెక్టు తీసుకొని సినిమా చేస్తున్నారు. వీరు చేసే ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించాలి'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సాయి వెంకట్, విష్ణు ప్రియ, నాగబాబు, దామోదర్ ప్రసాద్, బాలిరెడ్డి, తెలంగాణా జాగృతి కార్యకర్తలు, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: జి.ఎల్.బాబు, సంగీతం:కనిష్క, ఎడిటర్: నాగబాబు, మేకప్: సాయి కిరణ్, కాస్ట్యూమ్స్: శ్రీనివాస్, స్టిల్స్: శ్రీకాంత్, ఆర్ట్: డేవిడ్, ఫైట్స్: బాజీ, కోరియోగ్రాఫర్స్: కపిల్, రాజు, ఆనంద్, గోరా, ప్రొడ్యూసర్: నరేందర్.పి, డైరెక్టర్: గోపీనాథ్.