అఖిల్ అక్కినేని హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ నిర్మించిన చిత్రం 'అఖిల్'. దీపావళి కానుకగా నవంబర్ 11న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ లోని సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ''అఖిల్ సినిమాకు ఇంత మంచి అప్లాజ్ వస్తున్నందుకు అమల, నేను చాలా సంతోషంగా ఉన్నాం. ఓపెనింగ్స్ 10 కోట్ల షేర్స్ వచ్చాయి. బి,సి సెంటర్స్ ఆడియన్స్ ను రీచ్ అవ్వడానికి మాకు చాలా సమయం పట్టింది. కాని వినాయక మొదటి సినిమాతోనే అఖిల్ ను బి.సి సెంటర్స్ ప్రేక్షకులకు దగ్గర చేశారు. అఖిల్, సాయేషా బాగా నటించారు. ఒక నటునిగా అఖిల్ కు ఫైవ్ స్టార్స్ రేటింగ్ ఇస్తాను. అఖిల్ నా కొడుకు అవ్వడం వలన ఎక్కువగా చెప్పలేకపోతున్నాను. రీసెంట్ గా నాగబాబు గారి అబ్బాయి వరుణ్ తేజ్ 'కంచె' చిత్రంలో ఎంతో అధ్బుతంగా నటించాడు. అప్ కమింగ్ హీరోస్ ను ప్రోత్సహించాలి. అఖిల్ తన మొదటి చిత్రంలోనే ఫైట్స్, డాన్సులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 10 సినిమాల తరువాత తనకు ఇంకా మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది. నేనొక విషయంలో అనడరికి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. అఖిల్ నాతో గొడవ పడ్డాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. నిజానికి అలా గొడవ పడేంత స్టుపిడ్ ఫ్యామిలీ మాది కాదు. నాకైనా.. కొన్ని పరిస్థితుల్లో కోపం వస్తుంది కాని అఖిల్ కు గాని చైతు కు గాని అస్సలు రాదు. నాన్నగారు ఎప్పుడు యాక్టర్ అనేవాడికి డిక్షన్ చాలా ముఖ్యమని చెప్పేవారు. అఖిల్ కు మంచి వాయిస్ ఉంది. తను చేసే డాన్సులు, ఫైట్స్ చూస్తుంటే చాలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యాను. అమల మంచి డాన్సర్. బహుశా తన జీన్స్ అఖిల్ కు వచ్చి ఉంటాయి. నిఖిల్, సుధాకర్ రెడ్డి గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు'' అని చెప్పారు.
వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. ''అఖిల్ సినిమా రిలీజ్ కు ఏ డెబ్యూ హీరోకు రాని ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా నాగార్జున గారు స్క్రీన్ మీద కనిపించినప్పుడు థియేటర్ లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీస్ అంతా సినిమాను చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అఖిల్ నటనకు అన్ని ఏరియాల నుండి యునానిమాస్ రెస్పాన్స్ వచ్చింది. రకరకాలా వాతావరణంలో సినిమాను తీశాం. మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్'' అని చెప్పారు.
నితిన్ మాట్లాడుతూ.. ''అఖిల్ నాకు తమ్ముడు లాంటి వాడు. మంచి యాక్షన్ సబ్జెక్టు తో తనను హీరోగా లాంచ్ చేయాలని డిసైడ్ అయ్యాం. దానికి వినాయక గారి కరెక్ట్ డైరెక్టర్ అని ఆయనతో కలిసి సినిమా చేశాం. మొదటి రోజు 9.8 కోట్ల షేర్స్ వచ్చాయి. ఈరోజు కలెక్షన్స్ ఇంకా స్ట్రాంగ్ అయ్యాయి. మా బ్యానర్ కు మంచి దీపావళి గిఫ్ట్ అఖిల్ సినిమా'' అని చెప్పారు.
సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ''9.8 కోట్ల షేర్స్ ఓ డెబ్యూ హీరోకు రావడం మామూలు విషయం కాదు. నాగార్జున గారు మా బ్యానర్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమా చేసే అవకాశం మాకిచ్చారు. వినాయక్ లేకపోతే ఈ సినిమా ఇంత తొందరగా కంప్లీట్ అయ్యేది కాదు. అఖిల్ పర్ఫెక్ట్ ఆర్టిస్ట్. సాయేషా కొత్త అమ్మాయి అయినా.. బాగా చేసింది. చివరి పాటలో నాగార్జున గారు కనిపించగానే థియేటర్ లో ఫ్యాన్స్ అందరూ.. గోల గోల చేశారు. ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. అందరికి ధన్యవాదాలు''అని చెప్పారు.
అఖిల్ మాట్లాడుతూ.. ''బ్రహ్మానందం గారితో పని చేసిన 14 రోజులు షూటింగ్ ఎప్పటికి మర్చిపోను. సెకండ్ హాఫ్ అంత సినిమాను ఆయన బాగా క్యారీ చేశారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్. అక్కినేని ఫ్యాన్స్ ఇచ్చే సపోర్ట్ మర్చిపోలేనిది'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సాయేషా, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.